YS Avinash Reddy: అవినాష్ బెయిల్ రద్దు కానుందా.. నామినేషన్ కు ముందే భారీ షాక్ తగలనుందా?

YS Avinash Reddy: వివేకాహత్యకేసు కీలక దశలో ఉంది. ప్రస్తుత పరిణామాలు చూస్తుంటే అవినాష్ రెడ్డి త్వరలో అరెస్ట్ అయ్యే పరిస్థితి కనిపిస్తోంది. ఆయన బెయిల్ రద్దు చేయాలని సీబీఐ కోర్టులో గట్టిగా వాదించింది. నేరుగా బెయిల్ రద్దు చేయాలని సీబీఐ పిటిషన్ వేయకపోయినా.. దస్తగిరి వేసిన పిటిషన్ పై గట్టిగా సపోర్టు చేసింది. దస్తగిరి వాదనల్లో నిజం ఉందని తెలిపింది. అవినాష్ రెడ్డి ఇంకా బయట ఉంటే సాక్షులను ప్రభావితం చేసే ప్రమాదం ఉందని వాదించింది. నిజానికి ఎవరికైనా బెయిల్ మంజూరు అయితే.. సాక్షులను ప్రభావితం చేయొద్దని కోర్టు మొదటి షరతు విధిస్తుంది. కానీ, అవినాష్ రెడ్డి ఆ షరతులను పాటించలేదు. సాక్షులను ప్రభావితం చేసే ప్రయత్నం చేశారు. ఈ విషయాన్నే అటు దస్తగిరి, ఇటు సీబీఐ బలంగా కోర్టు ఎదుట పెట్టాయి.

దస్తగిరి చాలాసార్లు ఆయన్ని ఎన్ని రకాలుగా ప్రలోభాలకు గురి చేశారో చెప్పారు. ఈ కేసులో ఆయన అప్రూవర్ గా మారిన తర్వాత ఆయన్ని ప్రలోభాలకు గురి చేసే ప్రయత్నం చేశారు. దీంతో.. ఆయనపై బెదిరింపులకు గురి చేశారు. అయినా.. దస్తగిరి లొంగక పోవడంతో.. ఆయన కిడ్నాప్, దాడి కేసు పెట్టి కడప జైల్లో పెట్టారు. కడప జైల్లో ఆయనపై వచ్చిన ఒత్తిడి, ప్రలోభాలను గురి చేశారు. ఆ తర్వాత జైల్లో కూడా దస్తగిరిని అనుకూలంగా మార్చుకోవడానికి ప్రయత్నించారు. కడప జైల్లో తనను దేవిరెడ్డి శివశంకర్ రెడ్డి కుమారుడు చైతన్య రెడ్డి కలిశారని దస్తగిరి చెప్పారు. హెల్త్ చెక్ అప్స్ పేరుతో జైల్లో ఉన్న దస్తగిరి దగ్గరకు డాక్టర్ చైతన్య రెడ్డి వెళ్లారు. సీబీఐ ఎస్పీ రామ్‌సింగ్ తనను కొట్టి.. ఒత్తిడి తీసుకొని వచ్చి అప్రూవర్‌గా మార్చారని చెప్పాలని ఆయనపై ఒత్తిడి చేశారు. వివేకానంద రెడ్డి పీఏ కృ‌ష్ణారెడ్డి కూడా అలాగే చెప్పారని.. తనను కూడా అలాగే చెప్పాలని కోరాడని దస్తగిరి తెలిపాడు. తాను అలా చెబితే కేసు వీగిపోతుందని.. అందరం బయటపడొచ్చని సలహా ఇచ్చారడని తెలిపాడు. అంతేకాదు.. అలా చేస్తే 20 కోట్ల రూపాయలు ఆఫర్ చేశారని దస్తగిరి సంచలన వ్యాఖ్యలు చేశాడు.

ఇవే అంశాలు దస్తగరి, సీబీఐ.. కోర్టుకు తెలిపారు. కోర్టు ఈ నెల 15కు విచారణ వాయిదా వేసింది. వాదనలు విన్న నిపుణులు అవినాష్ బెయిల్ రద్దు కావడం ఖాయంగా చెబుతున్నారు. ఈ నెల 18 నుంచి నామినేషన్ల ప్రక్రియ మొదలవుతుంది. అంటే.. నామినేషన్ల కంటే ముందే ఆయన అరెస్ట్ అయ్యే అవకాశం ఉంది. ఈ కేసులో నిందితులందరినీ అరెస్ట్ చేసినా.. అవినాష్ రెడ్డిని అరెస్ట్ చేయకపోవడంతో సీబీఐపై చాలా విమర్శలు వచ్చారు. అన్ని వైపుల నుంచి వచ్చిన ప్రశ్నలకు సీబీఐ ఉక్కిరి బిక్కిరి అయింది. అయితే, ఈసారి మాత్రం ఆ మాట పడే ఛాన్స్ ఇవ్వలేదు. కోర్టు ఖచ్చితంగా బెయిల్ రద్దు చేసేలా వాదనలు వినిపించింది

మేమంతా సిద్దం సభలో అవినాష్ రెడ్డి అమాయకుడని జగన్ చెప్పుకొచ్చారు. బాబాయ్ వివేకాన్ని ఎవరు హత్య చేశారో దేవుడికి తెలుసు, జిల్లా ప్రజలకు తెలుసు. హత్య చేసినవాళ్లు దర్జాగా బయట తిరుగుతున్నారని మొసలి కన్నీరు కార్చారు. అంతటితో ఆగకుండా… ఆ హతంకులకు అండగా చంద్రబాబు, ఎల్లో మీడియా ఉందని పాత రికార్డులే తిప్పారు. ఇప్పుడు అవినాష్ బెయిల్ రద్దు అయితే జగన్ ఏం చెబుతారా.. అని ఉత్కంఠ నెలకొంది.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -