Roja: వైసీపీ మంత్రి రోజా ఆన్ ఫైర్.. ఆమె కామెంట్లు మీరు విన్నారా?

Roja: ఆంధ్రప్రదేశ్ ఫైర్ బ్రాండ్ మంత్రుల్లో రోజా రెడ్డి ఒకరు. ప్రతిపక్ష పార్టీలపై నిత్యం ఏదో ఒక మాట అంటూనే ఉంటుంది. ఒక్కోసారి రోజా మాట్లాడే మాటలని వినలేం. ముఖ్యంగా చంద్రబాబు, పవన్ పై ఓ స్థాయిలో నగరి ఎమ్మెల్యే, మంత్రి రోజా రెచ్చిపోతుంటారు.
ఇక తాజాగా వైజాగ్ లో జరుగుతున్న పారిశ్రామికవేత్త మీట్ గురించి ట్వీట్ చేసింది. ఇప్పుడు అదికాస్త వైరల్ గా మారింది.

 

ఢిల్లీ వాడు వెక్కిరించినా.. మద్రాస్ వాడు వెళ్ళగొట్టినా.. హైద్రాబాద్ వాడు గెంటేసినా.. అంటూ ట్వీట్ చేసింది రోజా. ఇందులో రైమింగ్ ని కూడా జోడించింది. మా కాళ్ళ మీద మేము నిలబెడుతున్నాం. పక్క రాష్ట్రాల రాజధానులకు ధీటుగా మా వైజాగ్‌ని తీర్చిదిద్దుతామని ప్రస్తావించారు.

ఇవన్నీ ఆమె చెబుతున్నట్టు కాదు.. నిజమైన ఆంధ్రుడు చెబుతున్నట్టు అట. ఇంతకీ, ఈ నిజమైన ఆంధ్రుడెవరు. మంత్రి రోజాకే తెలియాలి. ‘వైజాగ్ వెల్‌కమ్స్‌ యు..’అంటూ వైఎస్ జగన్ మార్క్ గవర్నెన్స్, అడ్వాంటేజ్ ఏ ఏపీజీఐఎస్2023 అనే హ్యాష్ ట్యాగ్స్‌ని కూడా రోజా జత చేశారు.

 

పెట్టుబడిదారుల్ని విశాఖపట్నం ఆహ్వానిస్తూ అందులో వైఎస్ జగన్ మార్క్ గవర్నెన్స్ అనే ప్రస్తావన ఎందుకు వచ్చిందో మంత్రి రోజాకే తెలియాలని కామెంట్లు వస్తున్నాయి. పైగా, ఢిల్లీ వాడు వెక్కిరించడమేంటో.. చెన్నయ్ వాడు వెల్లగొట్టడమేంటో.. హైద్రాబాద్ వాడు గెంటేయడమేంటో అని చర్చించుకుంటున్నారు. రోజాకు ఇంత సబ్జెక్టు ఎప్పుడు తెలుసబ్బా అని నాలుక కరుచుకుంటున్నారు. ఎవరన్నా ఈ మాటలు అంటే చెల్లుతాయేమో కానీ, రోజా అంటేనే ఒకింత వింతగా ఇంకాస్త రోతగా వున్నాయన్న చర్చ సోషల్ మీడియాలో జరుగుతోంది. దానికి బలమైన కారణమూ లేకపోలేదు.

 

విశాఖకు పెట్టుబడిదారుల్ని ఆహ్వానించడం వరకూ తప్పు లేదు. పక్క రాష్ట్రాల రాజధానులకు ధీటుగా.. అనడమూ తప్పు కాదు. వున్న ఏకైక రాజధాని అమరావతిని నాలుగేళ్ళుగా వేధించి, చంపేసి ఇప్పుడేమో విశాఖ రాజధాని అంటే పెట్టుబడిదారులైనా ఎలా నమ్ముతారని ప్రశ్నిస్తున్నారు.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -