వైసీపీ ఇంఛార్జ్ ల రెండో జాబితా రిలీజ్.. వాళ్లకు తగిన ప్రాధాన్యత ఇచ్చిన జగన్ కు తిరుగులేదుగా!

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అధికారంలో ఉన్న వైసీపీ రాష్ట్రంలో మరోసారి అధికారంలోకి వచ్చే దిశగా అడుగులు వేస్తోంది. సామాజిక సాధికారత కల్పిస్తూ వైసీపీ రెండో జాబితాను విడుదల చేయగా అభ్యర్థుల ఎంపిక విషయంలో జగన్ సరైన అడుగులు వేశారని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. మైనార్టీ, ఎస్సీ, ఎస్టీ, బీసీలకు ప్రాధాన్యత ఇస్తూ వైసీపీ రెండో జాబితా విడుదల కావడం గమనార్హం. రెండో జాబితాలో కొంతమంది ఎమ్మెల్యేలకు స్థాన చలనం కలగగా మరి కొందరు కొత్త అభ్యర్థులకు అవకాశం దక్కింది.

వైసీపీ అభ్యర్థుల రెండో జాబితాలో నలుగురు వారసులకు టికెట్లు దక్కాయి. టికెట్లు దక్కించుకున్న వారసులలో తిరుపతి నుంచి భూమన అభినయ్, చంద్రగిరి నుంచి చెవిరెడ్డి మోహిత్ రెడ్డి, గుంటూరు ఈస్ట్ నుంచి షేక్ నూరి ఫాతిమా, మచిలీపట్నం నుంచి పేర్ని కృష్ణమూర్తి ఉన్నారు. ఈ అభ్యర్థుల తండ్రులు ప్రస్తుతం సిట్టింగ్ ఎమ్మెల్యేలు ఆనే సంగతి తెలిసిందే. వైసీపీ మలి జాబితాను పరిశీలించిన విశ్లేషకులు 2024 ఎన్నికల్లో వైసీపీకి తిరుగులేదని చెబుతున్నారు.

పలు సర్వేలు సైతం 2024లో వైసీపీదే అధికారమని టీడీపీ జనసేన కూటమి ప్రభావం చూపే ఛాన్స్ లేదని తేల్చి చెబుతున్నాయి. ఈ జాబితాలో రాజమండ్రి ఎంపీ మార్గాని భరత్ ను రాజమండ్రి సిటీకి మార్చగా మంత్రి చెల్లుబోయిన వేణుగోపాల్ ను రామచంద్రాపురం నుండి రాజమండ్రి రూరల్ కు మార్చడం గమనార్హం. విజయవాడ సెంట్రల్ నుంచి మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావు పోటీ చేయనున్నారు.

వెల్లంపల్లి శ్రీనివాసరావు స్థానంలో మైనార్టీకి చెందిన షేక్ ఆసిఫ్ కు అవకాశం దక్కింది. పోలవరం నుంచి తెల్లం బాలరాజు సతీమణి తెల్లం రాజ్యలక్ష్మికి అవకాశం దక్కింది. పిల్లి సుభాష్ చంద్రబోస్ తనయుడు పిల్లి సూర్యప్రకాష్ కు కూడా సీఎం జగన్ ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం కల్పించారు. పిఠాపురం నుండి వంగ గీత, ప్రత్తిపాడు నుండి వరుపుల సుబ్బారావు, జగ్గంపేట నుండి తోట నరసింహంలకు వైసీపీ రెండో జాబితాలో చోటు దక్కింది.

గుంటూరు ఈస్ట్ నుండి షేక్ నూరి ఫాతిమా, కదిరి నుండి బియస్.మక్బూల్ అహ్మద్ లకు ఛాన్స్ ఇవ్వడం ద్వారా వైసీపీ మైనార్టీల సంక్షేమానికి ప్రాధాన్యత ఇచ్చే పార్టీ అని మరోసారి జగన్ ప్రూవ్ చేశారు. పాయకరావు పేట నుండి కంబాల జోగులు, పి.గన్నవరం నుండి విప్పర్తి వేణుగోపాల్, ఎర్రగొండపాలెం నుండి తాటిపర్తి చంద్రశేఖర్ లకు అవకాశం దక్కగా ఈ అభ్యర్థులకు టికెట్లు కేటాయించి ఎస్సీ సామాజిక వర్గానికి సైతం జగన్ న్యాయం చేశారు.

అరకు ఎంపీ స్థానానికి కొట్టగుళ్ళి భాగ్యలక్ష్మి, పోలవరం తెల్లం రాజ్యలక్ష్మి లకు అవకాశం కల్పించడం ద్వారా ఎస్టీ సామాజిక వర్గానికి సైతం ప్రాధాన్యత ఇచ్చారు. రెండు జాబితాలలో మొత్తం 38 మందిని నియమించారు. పార్టీని నమ్ముకున్న వారికి నామినేటెడ్ పోస్టులు ఇచ్చి న్యాయం చేస్తానని జగన్ మాటిచ్చారని తెలుస్తోంది. అభ్యర్థుల ఎంపిక విషయంలో సామాజిక న్యాయం చూపించిన సీఎం జగన్ కు 2024 ఎన్నికల్లో తిరుగులేదంటూ నెటిజన్ల నుంచి కామెంట్లు వినిపిస్తున్నాయి.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -