Pawan Kalyan: పవన్ కళ్యాణ్ ధ్యానం చేస్తున్న వైసీపీ.. పవన్ ను ఓడిస్తే చాలా ఇంకేం అక్కర్లేదా?

Pawan Kalyan: ఏపీలో ఎన్నికల వేడి రాజుకుంది. ఎన్నికల కోడ్ వచ్చిన తర్వాత ఆ వేడి మరింతగా రాజుకుంది. వైనాట్ 175 అంటున్నజగన్.. తన ఫోకస్ మొత్తం పవన్ పోటీ చేస్తున్న పిఠాపురంపైనే పెట్టారు. ఆయన ఒక్కరే కాదు.. వైసీపీ నేతలంతా పిఠాపురంలో వాలిపోయారు. ఓరకంగా చెప్పాలంటే.. ఏపీలో పిఠాపురం ఉపఎన్నిక జరుగుతుందా? దాన్ని వైసీపీ అధినేత ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారా? అన్న అనుమానం కలుగుతోంది. తెలంగాణలో 2022లో మునుగోడు ఉపఎన్నిక జరిగింది. అప్పుడు.. బీఆర్ఎస్ దాన్ని చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. అందుకే ఒక్కో ఎమ్మెల్యే ఒక్కో గ్రామంలో నెలరోజుల పాటు పర్యటించి.. ప్రచారం చేసి ఆ స్థానాన్ని సొంతం చేసుకున్నారు. దేశంలో కాస్ట్లీ ఎన్నిక ఏదైనా ఉంది అంటే అది మునుగోడు అని అంటారు.

ఇప్పుుడు మునుగోడును మరిపించేలా వైసీపీ నేతలు పిఠాపురంలో మొహరించారు. పిఠాపురం నుంచి వైసీపీ తరుఫున వంగా గీత పోటీ చేస్తున్నారు. అక్కడ పవన్ కల్యాణ్ గెలుపు నల్లేరు మీద నడకేనని ఎవరైనా చెబుతారు. జగన్ ఆశయంలో కోసం ఆ పార్టీ నేతలు ఎంతవరకైనా వెళ్తారు. అధినేత కలను నిజం చేయడానికి ఏం చేస్తే బాగుటుందో అనే వ్యూహాలకు పదునుపెడతారు. పవన్ అసంబ్లీలో అడుగు పెట్టుకుండా.. ఆయన్ని ఓ ఫెయిల్యూర్ లీడర్ గా చూపించాలని జగన్ తపన. గత ఎన్నికల్లో కూడా రెండు చోట్ల ఓడించడంతో పవన్ మాట మనిషే తప్పా.. చేతల మనిషికాదని ప్రచారం చేశారు. ఈ సారి కూడా ఓ మహిళ చేతిలో ఓడిపోతే.. ఇంకా రాజకీయాకు పవన్ పనికి రాడదని.. రాజయోగం ఆయనకు లేదని ప్రచారం చేయడానికి జగన్ ప్లాన్ వేస్తున్నారు. జగన్ కోరిక పవన్‌ని ఓడించడం కాబట్టి.. దాని కోసం వైసీపీ సైన్యం రంగంలోకి దిగారు. ఎవరి పాత్ర వాళ్లు పోషిస్తున్నారు. పాత్రలు లేని వాళ్లు కూడా జగన్‌న్ని మెప్పించడం కోసం పాత్రలను కల్పించుకుంటున్నారు.

ఇలా కల్పించుకుంటున్న వారిలో వెల్లంపల్లి, అంబటి రాంబాబు, గుడివాడ అమర్నాథ్, రోజా ఉన్నారు. వీరంతా తమ నియోజవర్గాల్లో పోటీ చేస్తున్నావారే. వెల్లంపల్లి మినహా మిగిలిన వారికి చివరి జాబితా వరకూ టికెట్ దక్కలేదు. టికెట్ రాదనే అంతా అనుకున్నారు. అంతా అనుకోవడం పక్కన పెడితే రోజా, గుడివాడ అమర్నాథ్ కూడా వారికి ఈ సారి టికెట్లు రావనే ఫిక్స్ అయ్యారు. అందుకే.. టికెట్ రాకపోయినా.. పర్వాలేదు. జగన్ బంటులగా ఉంటామని ప్రకటించారు. నిజంగా టికెట్ ఇవ్వకపోతే నోరేసుకొని పడిపోతారనో.. లేదంటే అభ్యర్థి దొరక్కో వారికి చివరి నిమిషంలో జగన్ టికెట్లు కేటాయించారు. ఆయా నియోవర్గాల్లో వారికి టికెట్లు ఇస్తే ఓడిస్తామని పార్టీ శ్రేణుల నుంచి అధిష్టానానికి హెచ్చరికలు కూడా వెళ్లాయి. అయినా టికెట్లు కేటాయించారు. దీంతో.. వారి గెలుపు నియోజక వర్గాల్లో అంతంతమాత్రంగానే ఉంది.

కానీ… వారి నియోజకవర్గాల్లో ప్రచారాన్ని పక్కన పెట్టి పవన్ పై ఫోకస్ చేస్తున్నారు. పవన్‌ను డీ గ్లామరస్ చేస్తున్నారు. అయితే, ఆపరేషన్ పవన్ కోసం జగన్ వారిని నియమిస్తే వారు ఏం మాట్లాడినా పర్వాలేదు. పిఠాపురం ఆపరేషన్ కోసం మిథున్ రెడ్డి, మాజీ మంత్రి కన్నబాబు, మంత్రి ద్వారంపూడి, దాడి శెట్టి రాజా, ముద్రగడ పద్మనాభం లాంటివారిని నియమించారు. పవన్ ను ఓడించేందుకు వారంత నిమగ్నం అయ్యారు. కానీ.. వెల్లంపల్లి, అంబటి రాంబాబు, గుడివాడ అమర్నాథ్, రోజా పని కల్పించుకొని పవన్ గురించి మాట్లాడుతున్నారు. విమర్శలు చేస్తున్నారు. అసలే వారికి గెలుపు అవకాశాలు తక్కువ ఉన్నాయి. మరి అలాంటప్పుడు వారి గెలుపుకోసం కాకుండా పవన్ ఓటమిపై ఎందుకు ఫోకస్ చేస్తున్నారని అరా తీస్తే.. ఎలాగూ తమ ఓటమి ఖాయం అయింది కనుక.. పవన్ పై నాలుగు విమర్శలు చేస్తే జగన్ భజన కొట్టినట్టు ఉంటుందని.. అధినేత ఆశీస్సులు తమకు ఉంటాయని ప్లాన్ వేస్తున్నారని తెలుస్తోంది.

మరోవైపు వైసీపీ సోషల్ మీడియా కూడా పిఠాపురంపైనే వార్తాలు వండివడ్డిస్తుంది. అయితే.. టీడీపీ, జనసేన మాత్రం అదే మంచిదని భావిస్తున్నారు. వైసీపీ చతురంగ బలాలు పిఠాపురంపై పెడితే మిగిలిన నియోజవర్గాల్లో తమ గెలుపు ఈజీ అవుతుందని కూటమి నేతలు భావిస్తున్నారు.

Related Articles

ట్రేండింగ్

CM Jagan: చిరు జీవులకు సైతం అన్యాయం చేసిన జగన్ సర్కార్.. మరీ ఇంతలా మోసమా?

CM Jagan: జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత పెద్ద ఎత్తున రాష్ట్రంలో అవినీతి అక్రమాలు జరుగుతున్నాయి. పెద్ద ఎత్తున దోపిడీలు చేస్తున్నారు వైకాపా నేతలు కొండలను గుట్టలను చెరువులను వదలలేదు పెద్ద...
- Advertisement -
- Advertisement -