YSRCP Bus Yatra: వైసీపీ గడ్డు పరిస్థితిని బస్సు యాత్ర బయటకు తెలిసేలా చేస్తోందా.. ఏం జరిగిందంటే?

YSRCP Bus Yatra: ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో అధికారంలో ఉన్నటువంటి వైఎస్ఆర్సిపి ప్రభుత్వం పరిస్థితి రోజురోజుకు దిగజారి పోతుందని తెలుస్తోంది. ఎప్పుడైతే చంద్రబాబు నాయుడుని అరెస్టు చేశారో ఆ క్షణం నుంచి పార్టీ పట్ల ప్రతి ఒక్కరిలోనూ తీవ్రస్థాయిలో వ్యతిరేకత ఏర్పడింది. కూడా దగ్గర పడుతున్నటువంటి నేపథ్యంలో పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు మంత్రులు నేతలను ప్రజలలోకి వెళ్లాలని జగన్మోహన్ రెడ్డి ఆదేశాలు జారీ చేస్తున్నారు.

ఇలా ఇప్పటికే ఎన్నో కార్యక్రమాల ద్వారా ఎమ్మెల్యేలు ప్రజలలోకి వెళ్ళగా వారికి చేదు అనుభవమే ఎదురవుతుంది అయితే తాజాగా బస్సు యాత్ర కూడా ప్రారంభించిన సంగతి మనకు తెలిసిందే. ఈ బస్సు యాత్ర అట్టర్ ఫ్లాప్ అవుతుందని తెలిసినప్పటికీ కూడా తప్పనిసరిగా చేయాలని జగన్మోహన్ రెడ్డి సూచిస్తున్నారు. జగన్ మోహన్ రెడ్డి ఏదైనా బహిరంగ సభ నిర్వహిస్తే పెద్దఎత్తున డ్వాక్రా మహిళలను ఆ సభలకు తరలిస్తున్న సంగతి తెలిసిందే.

ఇలా జగన్మోహన్ రెడ్డి సభకే ప్రజలు స్వచ్ఛందంగా ముందుకు రాలేదు అలాంటిది మంత్రులు ఎమ్మెల్యేలు ఎవరో సభలో నిర్వహిస్తే ప్రజలు ఎందుకు వెళ్తారు ఈ క్రమంలోనే ఎక్కడ ఈ సభలు నిర్వహిస్తున్న కూడా ప్రజలు కనిపించకపోవడంతో వైఎస్ఆర్సిపి పార్టీ పరిస్థితి ఏంటి అనేది స్పష్టంగా అర్థమవుతుంది. ఇలాంటి సభలకు కనీసం 200 మంది జనాలు కూడా రాకపోవడంతో పార్టీ పరిస్థితి ఎలా ఉందో తెలుస్తోంది.

బస్సు యాత్రలో భాగంగా స్వయంగా వైఎస్ఆర్సిపి పార్టీకి చెందినటువంటి కార్యకర్తలే రాకపోవడం గమనార్హం. సామాజిక బస్సు యాత్ర పేరుతో చంద్రబాబు కుటుంబాన్ని తిట్టడం.. చంపుతాం.. లేపేస్తాం అని హెచ్చరించడం తప్ప… ఆయా వర్గాలకు ఏం చేశారో చెప్పుకునే పరిస్థితి లేదు. ఎందుకంటే అందరికీ ఇచ్చే పథకాలు తప్ప… ఏ ఒక్క వర్గానికి జగన్ రెడ్డి మేలు చేయలేదు.బస్సు యాత్రల ద్వారా వైసీపీకి పరిస్థితి చాలా ఘోరంగా ఉందన్న విషయాన్ని ఆ పార్టీ నేతలే ప్రజల ముందు పెడుతున్నారు.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -