Vijayasai Reddy: పేదలకు సెంటు భూమి.. వైసీపీ నేతలకు ఎకరాలు.. జగన్ సర్కార్ ఇలా చేయడం న్యాయమేనా?

Vijayasai Reddy: విశాఖలో భారీగా ఆస్తులు కూడబెట్టుకుంటున్న విజయ్ సాయి రెడ్డి కుటుంబ సభ్యులు, అందుకు అడుగడుగునా సహకరిస్తున్న మహా విశాఖ నగరపాలక సంస్థ. ఇదంతా నిజమేనా అంటే నిజమే అంటున్నారు జనసేన పార్టీ విశాఖ నగర కార్పొరేటర్ మూర్తి యాదవ్. అమరావతిలో పేదలకి సెంటు భూములు సరిపోతాయి అంటూ వీళ్ళు మాత్రం ఎకరాలు ఎకరాలలో ఇల్లులు కట్టుకుంటూ విలువైన భూముల ఆక్రమణలకు పాల్పడ్డారని ఆరోపిస్తున్నారు మూర్తి యాదవ్.

విషయం ఏమిటంటే విజయసాయి రెడ్డి కుమార్తె నేహా రెడ్డి భాగస్వామిగా ఉన్న అవ్యాన్ రియాల్టర్స్ ఎల్.ఎల్.పి సంస్థ పేరున దాదాపు 100 కోట్లతో నిర్మిస్తున్న విల్లా పూర్తికాకముందే ఇంటికన్ను సృష్టించేశారు. దాదాపు 13 సంవత్సరాలు పాటు ఖాళీగా ఉన్న స్థలానికి కోట్లలో వసూలు చేయాల్సిన పన్ను వదిలేశారు. ఈ విషయం మీడియా చెప్పేవరకు జీవీఎంసీ అధికారులు దృష్టి పెట్టలేదు అంటూ మూర్తి యాదవ్ తీవ్ర స్థాయిలో ఆరోపణలు చేశారు. వైసీపీ అగ్ర నాయకుల్లో ఒకరిగా చక్రం తిప్పుతున్న విజయసాయిరెడ్డి కుటుంబ సభ్యులు బినామీ కంపెనీల పేరుతో ఉత్తరాంధ్రలో వేల కోట్ల ఆస్తులు విలువైన భూముల ఆక్రమణలకు పాల్పడ్డారని విమర్శించారు.

వైకాపా అధికారంలోకి వచ్చాక ఏ పనికి అనుమతి లభించాలన్న విజయసాయిరెడ్డికి కప్పం చెల్లించుకోవాల్సిందే. వివాదాస్పద దసపల్లా భూములను కొట్టేసి, అనకాపల్లి విస్సన్నపేట లేఅవుట్లో 60 ఎకరాలు బహుమతిగా పొందారు. ఆ విధంగానే మధురవాడలో 100 కోట్లతో నిర్మిస్తున్న విల్లాను హస్తగతం చేసుకున్నారు అని ఆరోపించారు.మధురవాడలోని సర్వే నెంబర్ 1 పి లో 62.7 ఎకరాలు, సర్వే నెంబరు 386 పి లో 17.3 ఎకరాలు. మొత్తం 80 ఎకరాలు గ్లోబల్ ఎంట్రో పొలిస్ ఆసియా ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ తో జాయింట్ వెంచర్ గా ప్రాజెక్టు చేపట్టింది.

ఆ తర్వాత వుడా నుంచి మొత్తం స్థలాన్ని ఆ సంస్థ కొనుగోలు చేసి పనోరమా హిల్స్ శ్రీరాం ప్రాపర్టీస్ పేరుతో కొంత స్థలంలో ఇళ్లనిర్మానాలు చేపట్టింది. ఆ సమయంలోనే వైకాపా అధికారంలోకి వచ్చింది. అనుమతుల కోసం విజయసాయి రెడ్డికి కప్పం చెల్లించాల్సి ఉన్నందున ఆ ప్రాజెక్టుకు చెందిన విల్లా నెంబర్ 126 స్థలాన్ని అవ్యాన్ కు రిజిస్ట్రేషన్ చేశారు. కేవలం విజయసాయి రెడ్డి ఒత్తిడి వల్లే అలా జరిగింది అంటూ మూర్తి రాజు ఆరోపించారు. జగన్ సర్కారుకు ఇలా చేయడం న్యాయమేనా అని నిలదీశారు.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -