Chennai: విమానంలో కొండచిలువ పిల్లలు.. అది తెలిసి ప్రయాణికులు బేంబేలు.. చివరికి?

Chennai: సాధారణంగా మనం ప్రయాణం చేసేటప్పుడు మనతో పాటుగా బట్టలు, లేదంటే ఏదైనా తినే పదార్థాలు, అలాగే విలువైన డాక్యుమెంట్స్, ఆభరణాలు ఇలాంటివి తీసుకుని వెళుతూ ఉంటారు. ఒకవేళ దొంగలు అయితే వారి దొంగలించిన ఆభరణాలు లేదంటే గంజాయి లాంటివి తీసుకెళ్తూ ఉంటారు. ఇక విమానంలో ప్రయాణం చేసేటప్పుడు అయితే ఇలాంటివన్నీ తీసుకెళ్లడం అసలు కుదరదు. ఎందుకంటే విమానంలో ప్రయాణించే దానికి ముందు ఒకటికి రెండుసార్లు చెక్ చేస్తూ ఉంటారు. కానీ ఒక వ్యక్తి మాత్రం విమానాశ్రయం వారి కళ్ళు కప్పి ఏకంగా తనతో పాటు కొండచిలువలు తీసుకెళ్తున్నాడు.

పూర్తి వివరాల్లోకి వెళితే…థాయ్‌ల్యాండ్‌ దేశం నుంచి చెన్నైకి తీసుకువచ్చిన కొండచిలువలను కస్టమ్స్‌ అధికారులు స్వాధీనం చేసుకుని తిరిగి ఆ దేశానికి తరలించారు. చెన్నై మీనంబాక్కం అంతర్జాతీయ విమానాశ్రయానికి థాయ్‌ల్యాండ్‌ దేశం నుంచి వచ్చిన విమానంలో విలువైన వస్తువులు తరలిస్తున్నట్లుగా అధికారులకు సమాచారం రావడంతో అప్రమత్తమమైన విమానాశ్రయ అధికారులు ప్రయాణికులపై నిఘా పెట్టారు. ఈ క్రమంలోనే థాయ్‌ల్యాండ్‌కు పర్యాటక వీసాలో వెళ్లి చెన్నైకి వచ్చినా దిండుగల్‌ కు చెందిన వివేక్‌ అనే వ్యక్తి దగ్గర తనిఖీ చేయగా ఒక్కసారి అధికారులు ఆశ్చర్యపోయారు.

ఎందుకంటే అతను దగ్గర ఏకంగా ఐదు కొండ చిలువ పిల్లలు బయటపడ్డాయి. వెంటనే వాటిని స్వాధీనం చేసుకున్న అధికారులు తిరిగి థాయ్‌ల్యాండ్‌కు పంపించారు. అనంతరం ఆ వివేక్ అనే వ్యక్తి ను అరెస్టు చేసి విచారణ చేపట్టారు. అయితే ఈ విషయం కాస్త తోటి ప్రయాణికులకు తెలియడంతో వారందరూ కూడా ఒకసారి షాక్ అయ్యారు.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -