Chennai: క్యాబ్ డ్రైవర్ ఖాతాలో ఏకంగా 9,000 కోట్ల రూపాయలు జమ.. ఆ తర్వాత ట్విస్ట్ ఏంటంటే?

Chennai: ఒక క్యాబ్ డ్రైవర్ ఖాతాలో ఉన్నట్టుండి తొమ్మిది వేల కోట్లు జమ అయ్యాయి. అయితే ఆ ఆనందం ఎంతోసేపు అతనికి నిలబడలేదు. ఇంతకీ ఏం జరిగిందో చూద్దాం. ఒక క్యాబ్ డ్రైవర్ ఖాతాలో ఉన్నట్టుండి అక్షరాల 9000 కోట్లు జమ అయ్యాయి. అయితే ఆ ఆనందం అతనికి ఎంతో సేపు నిలబడలేదు. ఈ ఘటన తమిళనాడులోని కోడంబక్కం ప్రాంతంలో వెలుగు చూసింది. పళని నెయ్ కారా పట్టికి చెందిన రాజ్ కుమార్ కొడంబక్కం ప్రాంతంలో తన స్నేహితులతో కలిసి నివసిస్తున్నాడు. అక్కడే ఉంటూ స్థానికంగా కారుని రెంటుకు తీసుకొని నడిపిస్తున్నాడు.

ఈ క్రమంలో సెప్టెంబర్ 9న మధ్యాహ్నం 3:00 సమయంలో రాజకుమార్ కారులో నిద్రిస్తున్నాడు. ఈ సమయంలో అతడు ఫోన్ కి తుత్తుకోడి జిల్లాలోని తమిళనాడు మెర్కంటైల్ బ్యాంక్ ప్రధాన కార్యాలయం నుంచి ఒక సందేశం వచ్చింది. అందులో రాజకుమార్ ఖాతాలోకి ఏకంగా తొమ్మిది వేల కోట్లు డిపాజిట్ అయినట్లుగా మెసేజ్ ఉంది. ఇది చూసిన రాజకుమార్ కి ముందుగా ఏమీ అర్థం కాలేదు. కేవలం 15000 ఉన్న తన బ్యాంకు ఖాతాలోకి ఒక్కసారిగా అంత పెద్ద మొత్తం ఎవరు చేసి ఉంటారు అని ఆలోచనలో పడ్డాడు.

నిజమో కాదో అని సందేహపడిన అతను నిర్ధారణ చేసుకోవడం కోసం తన స్నేహితుడికి అప్పుగా ఇవ్వాల్సిన 21,000 ను అతడికి పంపించి చూశాడు. ఆ లావాదేవీ సక్సెస్ఫుల్ కావడం వల్ల తన అకౌంట్లోకి వచ్చిన 9000 కోట్ల సందేశం నిజమే అని సంతోషించాడు. అయితే అతడు సంతోషం ఎంతోసేపు నిలబడలేదు. కారణం ఏమిటంటే స్నేహితుడికి డబ్బులు పంపిన కొద్దిసేపటికి రాజకుమార్ కి సంబంధిత బ్యాంకు నుంచి ఫోన్ కాల్ వచ్చింది. దయచేసి మీ బ్యాంక్ అకౌంట్ లో డిపాజిట్ అయిన 9000 కోట్ల సొమ్మును వాడకండి.

అవి పొరపాటున మీ అకౌంట్ కి బదిలీ అయ్యాయి అని బ్యాంక్ అధికారులు చెప్పారు. ఇది విన్న రాజ్ కుమార్ ఒక్కసారిగా నిరాశ చెందాడు. తను 21,000 వాడుకున్నట్టు బ్యాంకుకి తెలిపాడు. అయితే బ్యాంకు వారు తిరిగి ఆ డబ్బుని చెల్లించమని లేదంటే చర్యలు తీసుకుంటామని బెదిరించే ప్రయత్నం చేశారు. దీంతో రాజ్ కుమార్ దగ్గరలో ఉన్న పోలీస్ స్టేషన్ కి వెళ్లి ఫిర్యాదు చేశాడు. అయితే పోలీసులు ఇరువర్గాల న్యాయవాదులను పిలిపించి రాజీ కుదిర్చారు. వాడుకున్న 21000 వాహన లోన్ కింద బ్యాంకు జమ కడుతుందని బ్యాంకు తరఫున చెప్పటం వల్ల కదా సుఖాంతం అయింది.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -