IND PAK: పాకిస్తాన్‌తో భారత్ ఢీ.. చెన్నై, కోల్‌కత్తా వేదికగానే..

IND PAK: టీమిండియాతో పాకిస్తాన్ క్రికెట్ మ్యాచ్ అంటే ఆ మాజానే వేరు. పాక్ తో భారత్ మ్యాచ్ అంటేనే క్రికెట్ ఫ్యాన్స్ కళ్లు కాయలు కాసేలా ఎదురుచూస్తారు. దాయాది పాక్ తో మ్యాచ్ అంటేనే ఇండియన్స్ టీవీల ముందు అతుక్కుపోతారు. ఇండియా గెలవాలని ఆతృతగా ఎదురుచూస్తూ ఉంటారు. ఐసీసీ టోర్నీలలో మాత్రమే భారత్, పాకిస్తాన్ కలిసి ఆడుతున్నాయి. పాక్, భారత్ మధ్య ఉన్న శత్రుత్వం కారణంగా ద్వైపాక్షిక సిరీస్ లు ఉండటం లేదు. దీంతో ప్రపంచకప్ మ్యాచ్‌లలో మాత్రం ఇరు జట్టు తలపడుతున్నాయి.

ఇప్పుడు భారత్, పాక్ కలిసి ఆడేందుకు సిద్దమవుతున్నాయి. ఇందుకు చెన్నై, కోల్‌కతా వేదిక కానుంది. ఈ సారి వన్డే ప్రపంచకప్ కు భారత్ ఆతిధ్యం ఇవ్వనుంది. ఈ ఏడాది అక్టోబర్ లో వన్డే ప్రపంచకప్ ప్రారంభం కానుంది. ప్రపంచకప్ మ్యాచ్ లకు ఇప్పటికే షెడ్యూల్ ఫిక్స్ అవ్వగా.. మ్యాచ్ ల నిర్వహణకు వేదికలు కూడా సిద్దమయ్యాయి. హైదరాబాద్ తో పాటు చెన్నై, కోల్ కత్తా, అహ్మదాబాద్, ఇతర ప్రాంతాల్లో జరగనున్నాయి.

 

అయితే పాకిస్తాన్ తో భారత్ తలపడే మ్యాచ్ లు చెన్నై, పాకిస్తాన్ వేదికగా జరగనున్నాయి. చెన్నై, కోల్‌కత్తాలో ఆడేందుకు పాకిస్తాన్ మొగ్గు చూపుతోంది. కానీ బీసీసీఐ దీనిపై నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది. గతంలో 2016 టీ 20 వరల్డ్ కప లో కోల్ కతాలో టీమిండియా, పాక్ తలపడ్డాయి. ఇక చెన్నై కూడా పాక్ కు చిరస్మనీయ వేదిక. ఈ రెండు వేదికలు పాక్, భారత్ మధ్య మ్యాచ్ లకు అనుకూలంగా ఉంటాయని ఐసీసీ అధికారి తెలిపారు. మొత్తం 12 వేదికల్లో వన్డే ప్రపంచకప్ మ్యాచ్ లు జరగనున్నాయి. ప్రతి జట్టూ లీగ్ దశలో తొమ్మిది మ్యాచ్ లు ఆడనుంది.

 

 

Related Articles

ట్రేండింగ్

Raghu Rama Krishnam Raju: ఉండిపై ఉడుం పట్టు పట్టిన రఘురామ కృష్ణంరాజు.. అసెంబ్లీలో జగన్ కు వణుకేనా?

Raghu Rama Krishnam Raju: రఘురాం కృష్ణంరాజు కి కూటమి తరపున టికెట్ రాదు అనే భావించిన వైసీపీ వర్గం వారు సంబరాలు చేసుకున్న సంగతి అందరికీ తెలిసిందే అయితే అనూహ్యంగా తెదేపా...
- Advertisement -
- Advertisement -