Jagan Planning: ఒక్కో ఫ్యామిలీకి రూ.5 లక్షలు.. జగన్ ప్లానింగ్ మామూలుగా లేదుగా!

Jagan Planning: వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఎన్నికలకు ముందు ఇచ్చిన చాలా పథకాలను ప్రవేశపెట్టిన విషయం తెలిసిందే. అంతేకాకుండా ఈ నాలుగేళ్ల కాలంలో రైతులకు, మహిళలకు,ఆడపడుచులకు, విద్యార్థులకు ఇలా ప్రతి ఒక్కరికి కూడా తాను ప్రవేశపెట్టిన పథకాలు అందేలా చేశారు. వృద్ధులకు పెన్షన్లు, స్కూలు పిల్లలకు అమ్మఒడి పథకం, అక్క చల్లెమ్మలకు ఆసరా చేయూత ఇలా ఎన్నో పథకాలను అందించారు. ఇవన్నీ ఒక ఎత్తు అయితే ఆపదలో ఉన్నవారిని ఆదుకునే ముఖ్యమంత్రి మరో కీలక నిర్ణయం తీసుకోవడం అన్నది మరొక ఎత్తు అని చెప్పవచ్చు..

ఇది ఇలా ఉంటే తాజాగా తిరుపతి లో ఒక భారీ అగ్నిప్రమాదం చోటు చేసుకున్న విషయం తెలిసిందే. ఒక బాణాసంచా కర్మాగారంలో అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. వరదయ్యపాలెం మండలం ఎల్లకటవ విలేజ్ లో బాణాసంచా గోడౌన్ లో భారీ పేలుడు సంభవించింది. ఈ ఘటనలో ముగ్గురు కార్మికులు సజీవ దహనం అయ్యారు. అయితే ఈ ప్రమాద ఘటనై సిఎం స్పందించారు. బాణాసంచా గోడౌన్ అగ్నిప్రమాదంలో మృతి చెందిన కార్మికుల కుటుంబాలకు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఎక్స్ గ్రేషియా ప్రకటించారు.

 

మృతి చెందిన వారంతా పేద కుటుంబాలకు చెందినవారని, ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన వారని తెలుసుకున్నారు సీఎం జగన్. దాంతో మరణించిన కుటుంబాలకు రూ. 5 లక్షల చొప్పున పరిహారం అందించాలని అధికారులను ఆదేశించారు. ఆయా కుటుంబాలను ఆదుకునేందుకు తక్షణమే పరిహారాన్ని అందించి బాధిత కుటుంబాలను ఆదుకోవాలని అధికారులను ఆదేశించారు. సీఎం జగన్ ఆదేశాల మేరకు అధికారులు కూడా వెంటనే తక్షణ చర్యలు తీసుకున్నట్టు తెలుస్తోంది. బాధిత కుటుంబాలకు అనగా మృతి చెందిన ఒక్క కుటుంబ సభ్యులకు అదే ఐదు లక్షల రూపాయల పరిహారాన్ని అందించేలా చర్యలు తీసుకోమని ఆదేశించారు జగన్.

 

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -