Dahod: భార్య విషయంలో ఈ భర్త ప్రవర్తించిన తీరుకు షాకవ్వాల్సిందే!

Dahod: భార్య భర్తలైన తర్వాత తప్పకుండా గొడవలు ఉంటాయి అయితే ఆ గొడవలు నాలుగు కోడలు మధ్య ఉండాలి ఇతర కుటుంబ సభ్యులకు ఆ గొడవలు తెలిసిన వారి పరువు మర్యాదలు పోతాయి.ఇంటి గుట్టు ఎప్పుడు రట్టుగానే ఉండాలని పెద్దలు చెబుతుంటారు. ఇలా భార్యాభర్తల మధ్య ఎన్ని గొడవలు వచ్చిన ఆ గొడవలు పక్క వారికి తెలియకూడదు అని చెబుతుంటారు కానీ ఓ వ్యక్తి మాత్రం తన భార్య చేసిన తప్పుని బయట పెట్టడమే కాకుండా ఆమెను నగ్నంగా ఊరు మొత్తం ఊరేగించి ఆమె పట్ల నీచంగా ప్రవర్తించినటువంటి ఘటన గుజరాత్ లో చోటుచేసుకుంది.

భార్య భర్తల అన్న తర్వాత ఎలాంటి గొడవలు ఉన్న వాటిని వారి ఇంట్లోనే చూసుకోవాలి కాని ఇలా నగ్నంగా ఊరేగించడానికి కారణం ఏంటి అయితే ఒక మహిళను ఇలా నగ్నంగా ఊరేగిస్తూ ఉంటే ఈ ఘటనను ఎవరు ఆపే ప్రయత్నం చేయకపోవడమే కాకుండా సెల్ఫోన్లలో వీడియోలు తీస్తూ ఆనందించారు.ప్రస్తుతం ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అసలు ఆ మహిళ ఏ తప్పు చేసిందని ఆ భర్త అలా నగ్నంగా తనని ఊరు మొత్తం ఊరేగించారు అనే విషయానికి వస్తే…

 

దాహోద్ జిల్లాలోని ఓ గిరిజన మహిళకు కొన్నేళ్ల క్రితం వివాహం జరిగింది. ఈమెకు నలుగురు పిల్లలు జన్మించారు. ఏడాదిన్నర క్రితం భర్తను, పిల్లలను వదిలేసి ఇంట్లోంచి వెళ్ళిపోయింది. మెహ్సానా జిల్లాలోని చనస్మా గ్రామంలో వేరే వ్యక్తితో సహజీవనం చేస్తుంది. ఇలా తన భార్య వదిలేసి వెళ్లడంతో ఆమెపై ఆ భర్త చాలా పగబెట్టుకున్నారు. ఇక ఆ మహిళ రెండో భర్త గ్రామంలో బంధువుల పెళ్లి ఉండడంతో వారు ఆమె రెండో భర్తను మొదటి భర్తను కూడా వివాహానికి ఆహ్వానించారు.

 

ఈ క్రమంలోనే ఈ ముగ్గురు ఒకే చోట కలుసుకోవడంతో మొదటి భర్త ఆ మహిళను కిడ్నాప్ చేసి మర్గల గ్రామానికి తీసుకెళ్లాడు. అక్కడ అందరి ముందు భార్య బట్టలు విప్పి దారుణంగా కొట్టి చిత్రహింసలు పెట్టాడు. అంతటితో ఆగకుండా గ్రామస్తులు చూస్తుండగానే తనని ఊరు మొత్తం ఊరేగింపుగా తీసుకెళ్లాడు. దీంతో ఈ ఘటనను కొందరు సెల్ఫోన్లో చిత్రీకరించి సోషల్ మీడియాలో షేర్ చేయడంతో ఈ వీడియో వైరల్ గా మారింది. అయితే ఈ వీడియో పై పోలీసులు స్పందించి సదరు వ్యక్తిపై చర్యలకు సిద్ధమైనట్లు తెలుస్తోంది.

 

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -