Trivikram Srinivas: ఆ ఇద్దరు హీరోలతో సినిమాలు చేయబోతున్న త్రివిక్రమ్.. హాలీవుడ్ లెవెల్ లో?

Trivikram Srinivas: తెలుగు రాష్ట్రాల ప్రజలకు దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ గురించి పెద్దగా పరిచయం అక్కర్లేదు. నువ్వే కావాలి, నువ్వు నాకు నచ్చావ్, మన్మధుడు వంటి సినిమాలకు ప్రాణం పోసి త్రివిక్రమ్ దర్శకుడిగా ఒక గుర్తింపు సంపాదించుకున్నాడు. ఆ తర్వాత ఆ పలు స్టార్ హీరోల సినిమాలకు దర్శకత్వం వహించి అగ్రస్థాయి డైరెక్టర్ గా ఒక గుర్తింపు సంపాదించుకున్నాడు.

ఎంతలా అంటే ప్రస్తుతం త్రివిక్రమ్ సినిమాలో నటించడానికి ఏ హీరో అయిన ఇంట్రెస్ట్ చూపించాల్సిందే. అలా త్రివిక్రమ్ టాలీవుడ్ అగ్రస్టార్ డైరెక్టర్ గా ఓ వెలుగు వెలుగుతున్నాడు. ఇదిలా ఉంటే సితార ఎంటర్ టైన్ మెంట్స్ నిర్మాత, హారిక హాసిని సంస్థ నిర్వాహకుడు సూర్యదేవర నాగవంశీ గురించి మనందరికీ తెలిసిందే. ఇతడు దర్శకుడు త్రివిక్రమ్ తో ప్రపంచమంతా ఒక భారీ స్థాయి సినిమా నిర్మించాలని ప్లాన్ లో ఉన్నట్లు తెలిపాడు.

స్వాతిముత్యం సినిమా విడుదలకు సందర్భంగా గ్రేట్ఆంధ్రతో మాట్లాడుతూ ఎప్పటికైనా హాలీవుడ్ రేంజ్ లో త్రివిక్రమ్ తో సినిమా తీయాలన్నది నా కోరిక అని నాగ వంశీ తెలిపాడు. ఇక ఇది ఎలాంటి సినిమా ఎవరితో అన్న విషయం టైం వచ్చినప్పుడు చెప్తా అని తెలిపాడు. ఇక మీదట అన్ని మిడ్ రేంజ్ కమర్షియల్ సినిమాలే ప్లాన్ చేస్తున్నాము అని అన్నాడు. దాదాపు అందరు హీరోలతో సినిమాలు ఉంటాయని తెలిపాడు.

ఇక త్రివిక్రమ్ కాంబినేషన్ లో ప్రభాస్, రామ్ చరణ్ లతో చెరో సినిమా చేసే ఆలోచన ఉందని తెలిపాడు. ఇక మహేష్ బాబు విషయానికొస్తే అతడు చేసే సినిమా చాలా కొత్తగా ఉంటుందని తెలిపాడు. ఈ సినిమా మార్కెట్లో ఏ రేంజ్ లో ఉంటుందన్న అంచనాలు చెప్పలేను అని తెలిపాడు. ఇక తను వెళ్లి ఎవరిని సినిమాలు చేయమని అడగలేదట, అలాగే పెద్ద దర్శకులు ఎవరు తమ దగ్గరికి రాలేదని వంశీ వెల్లడించారు. ప్రస్తుతం నాగ వంశీ చేసిన కామెంట్లు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -