Mrunal Thakur: వేశ్యగృహంలో సీతారామం బ్యూటీ మృణాల్.. అలా అవమానించారంటూ?

Mrunal Thakur: తెలుగు సినీప్రియులకు ముద్దుగుమ్మ మృణాల్ ఠాకూర్ గురించి పెద్దగా పరిచయం అక్కర్లేదు. కేవలం ఒకే ఒక్క సినిమాతో ఓవర్ నైట్ స్టార్ గా మారిపోయింది. సీతారామం సినిమాలో దుల్కర్ సల్మాన్ సరసన సీత పాత్రలో తెలుగు ప్రేక్షకులను మరో స్థాయిలో ఆకట్టుకుంది. ఇక తన అందంతో మొదటి సినిమాతోనే చాలా మంది అభిమానులను సంపాదించుకుంది ఈ అమ్మడు.

ఇక ఇలాంటి అమ్మడు తన కెరీర్ మొదట్లో చాలా అవమానాలు ఎదుర్కొందట. తన తండ్రికి ఇష్టం లేని ఫీల్డ్ వైపు అడుగులు వేసి మృణాల్ బ్యాచిలర్ ఆఫ్ మాస్ మీడియా కోర్స్ లో చేరారట. ఆమె సరికొత్త దారి ఎంచుకున్నందుకు చాలామంది ఆమెను వెక్కిరించారట. ఇక తన తండ్రిని మీ అమ్మాయి ఏం చేస్తుందని అడగగా.. బి ఎం ఎం అని చెప్పేవారట. అసలు అది ఏం కోర్సు? అదొక చదవా? అని అందరూ అవమానించే వారట.

ఈ విషయం తెలుసుకున్న మృణాల్ కూడా అప్పుడు తన తండ్రి విషయంలో చాలా అవమానకరంగా ఫీల్ అయ్యిందట. అయితే మొదట్లో మృణాల్ కి లవ్ సోనీయా అనే సినిమాలో అవకాశం వచ్చిందట. డబ్బుల కోసం కన్న కూతురిని వ్యభిచార గృహానికి అమ్మేస్తే.. తన చెల్లిని కాపాడుకునే అక్క పాత్రలో మృణాల్ నటించింది. అయితే ఈ పాత్ర కోసం ఈమె రెండు వారాలు పాటు కోల్కతాలో ఒక వేశ్య గృహంలో ఉందట.

అక్కడ ఉండి వారి కథలు మొత్తం తెలుసుకున్నారట. వారి కథలను విని తట్టుకోలేక ఆమెకు ఒక్కసారిగా బీపీ డౌన్ అయిందట. పదేపదే ఆ వేశ్యల కథలు ముందు కనిపించడంతో డిప్రెషన్ లోకి వెళ్లిపోయిందట మృణాల్ తరువాత ఆ సినిమా డైరెక్టర్ ఈమెకు కౌన్సిలింగ్ ఇచ్చి ధైర్యం చెప్పడం తో కోలుకొని ఆ సినిమాను విజయవంతంగా పూర్తి చేసిందట. ఏదేమైనా మృణాల్ కు మొదటి సినిమాతోనే తెలుగు ఇండస్ట్రీలో ఊహించని స్థాయిలో ఆదరణ దక్కింది.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -