Andhra Pradesh-BRS: ఏపీలో బీఆర్ఎస్ పార్టీ ఫ్లెక్సీలు… అప్పుడే ఎంపీ అభ్యర్థులు దొరికేసారా?

Andhra Pradesh-BRS: తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కెసిఆర్ దసరా పండుగ రోజున తన కొత్త పార్టీని ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే ఈ విషయంపై ఎన్నో రోజుల నుంచి జాతీయ వ్యాప్తంగా చర్చ జరుగుతోంది. పార్టీ పేరు ప్రకటించక ముందు ఇతర రాష్ట్రాల ముఖ్యమంత్రులను మరియు నాయకులను కలిసి తన ప్రతిపాదనను వారి ముందు ఉంచారు. అయితే కొంత మంది నాయకులు మరియు ముఖ్యమంత్రులు సానుకూలంగానే స్పందించినట్లుగా తెలుస్తోంది.

కొన్ని దశాబ్దాల కాలంగా భారత దేశంలో రెండు మూడు జాతీయ పార్టీలు మాత్రమే ప్రాతినిధ్యం వహిస్తున్నాయి. అయితే ఈ పార్టీలకు ప్రత్యామ్నాయంగా ఎదగాలనేదే తెలంగాణ ముఖ్యమంత్రి లక్ష్యం. ఈ విషయం పైనే ఇతర రాష్ట్రాలకు చెందిన ముఖ్యమంత్రులతో చర్చలు జరిపారు.

అయితే ఈ విషయం గురించి పక్కన పెడితే బీఆర్ఎస్ పార్టీ ఆంధ్ర ప్రదేశ్ లో పోటీ చేస్తుందా లేదా అనేది ప్రశ్న. నిజం చెప్పాలంటే ఆంధ్ర ప్రదేశ్ లో కూడా కెసిఆర్ అభిమానులు చాలా మందే ఉన్నారు అనేది నిజం. ఎందుకంటే కెసిఆర్ పుట్టిన రోజు నాడు ఆంధ్ర ప్రదేశ్ లో కూడా ఫ్లెక్సీలు వెలిశాయంటే ఇక కెసిఆర్ పాపులారిటీ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అయితే పోటీ చేస్తుందా లేదా అనే విషయం పక్కన పెడితే పార్టీ ప్రకటించిన రెండు రోజులకే ఎంపీ అభ్యర్థి అంటూ ఫ్లెక్సీలు వెలిశాయి. అయితే కోనసీమ ప్రాంతంలోని అమలాపురంలో రేవు అమ్మాజీరావు పేరుతో ఫ్లెక్సీ లు వెలవడంతో పెద్ద చర్చే జరుగుతుంది.

ఎందుకంటే కెసిఆర్ కేవలం పార్టీ పేరుని మాత్రమే ప్రకటించారు కానీ పార్టీ ఇంచార్జ్ ల గురించి కానీ అభ్యర్థుల గురించి కానీ ఎటువంటి ప్రకటన చేయలేదు. ఆంధ్ర ప్రదేశ్ లో పోటీ చేయడానికి సన్నద్ధమవుతున్నామని చెప్పడానికి ఇది ఏర్పాటు చేసారా లేక దీనిపై ఏదైనా రాజకీయ వ్యూహం దాగి ఉందా అని విశ్లేషకులు రకరకాలుగా తమ అభిప్రాయాలను వ్యక్త పరుస్తున్నారు.

Related Articles

ట్రేండింగ్

Varun Tej: ప్రజలే పవన్ కల్యాణ్ కుటుంబం.. వరుణ్ తేజ్ కామెంట్లతో ఫ్యాన్స్ ను ఫిదా చేశారా?

Varun Tej: జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కి ప్రజలే కుటుంబ సభ్యులని, అప్పులు చేసి మరీ కౌలు రైతులకు సాయం చేస్తున్నారని సినీ నటుడు వరుణ్ తేజ్ అన్నారు. పవన్ కళ్యాణ్...
- Advertisement -
- Advertisement -