Suriya About Rolex Role: ఇష్టం లేకపోయినా ఆయన కోసం రోలెక్స్ పాత్రలో చేశా!

Suriya About Rolex Role: కోలీవుడ్ స్టార్ హీరోలలో ఒకరిగా ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్నారు నటుడు సూర్య. హీరోగా సూర్యకు కేవలం కోలీవుడ్ ఇండస్ట్రీలోనే కాకుండా తెలుగులో కూడా ఎంతో మంచి పేరు ప్రఖ్యాతలు ఉన్నాయి. ఇకపోతే ఈయన హీరోగా మాత్రమే కాకుండా పలువురు హీరోల సినిమాలలో అతిథి పాత్రలో కూడా నటిస్తున్న విషయం మనకు తెలిసిందే.

తాజాగా విక్రమ్ సినిమాలో నటించిన రోలెక్స్ కామియోపాత్ర ప్రతి ఒక్క ప్రేక్షకుడిని విపరీతంగా ఆకట్టుకుంది. ఈ సినిమాలో ఈయన పాత్రకు మంచి మార్కులు పడ్డాయి.ఇకపోతే తాజాగా ఈ సినిమాలో రోలెక్స్ పాత్ర గురించి సూర్య చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. తాజాగా ఫిలింఫేర్ అవార్డు కార్యక్రమంలో భాగంగా సురారై పోట్రు సినిమాకి గాను ఏకంగా 7 ఫిలింఫేర్ అవార్డులో వచ్చిన విషయం మనకు తెలిసిందే. ఇందులో ఉత్తమ నటుడుగా సూర్య అవార్డు అందుకున్నారు.

ఈ కార్యక్రమంలో భాగంగా రోలెక్స్ పాత్ర గురించి మాట్లాడుతూ తనకు సినిమా ఇండస్ట్రీలోకి వచ్చినప్పటి నుంచి కమల్ హాసన్ గారు ఎంతో స్ఫూర్తి అని తెలిపారు.ఇక ఆయన ఫోన్ చేసి ఇలా ఒక పాత్ర ఉంది నటిస్తావా అని అడిగినప్పుడు కాదనలేకపోయాను అయితే నిజానికి నాకు రోలెక్స్ పాత్రలో నటించడం ఇష్టం లేకపోయినా చేశాను.

ఈ పాత్రలో తాను నటించనని లోకేష్ కి చెప్పాలనుకున్న కాకపోతే కేవలం కమల్ హాసన్ గారి పై ఉన్న అభిమానంతోనే ఈ పాత్రలో నటించానని,ఈ సందర్భంగా రోలెక్స్ పాత్ర గురించి సూర్య చూసిన ఈ కామెంట్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.ఇక ఈ సినిమా ఈ ఏడాది విడుదల ఏకంగా 400 కోట్ల కలెక్షన్లను రాబట్టిన విషయం మనకు తెలిసిందే. ఇందులో కమల్ హాసన్ తో పాటు విజయ్ సేతుపతి, ఫహద్ ఫాజిల్ కూడా కీలక పాత్రలలో నటించారు. చివరి ఐదు నిమిషాల పాటు సూర్య రోలెక్స్ పాత్ర అద్భుతమని చెప్పాలి.

Related Articles

ట్రేండింగ్

CM Jagan: షర్మిలకు డిపాజిట్ రాదట.. బాధగా ఉందట.. జగన్ మొసలి కన్నీరు వెనుక లెక్కలివేనా?

CM Jagan: రాజకీయాలు కుటుంబ సభ్యులను సైతం బద్ధ శత్రువులుగా మారుస్తుందని విషయం మరొకసారి రుజువయింది. ఒకప్పుడు అన్యోన్యంగా ఉన్న వైఎస్ కుటుంబం ఇప్పుడు బద్ధ శత్రువులుగా మారిపోయి బహిరంగంగానే ఒకరిని ఒకరు...
- Advertisement -
- Advertisement -