Prabhas Sreenu: రాజమౌళితో సినిమా అంటే అంతే.. ఆ సినిమాలో నిజంగా దెబ్బలు తిన్నా : ప్రభాస్ శ్రీను

Prabhas Sreenu: నటుడు ప్రభాస్ శ్రీను.. విక్రమార్కుడు సినిమాలో రవితేజతో కలిసి నటించిన విషయం తెలిసిందే. రైల్వే స్టేషన్ లో విలన్ క్యారెక్టర్ గా ప్రభాస్ శ్రీను నటించారు. హీరో ఎంట్రీ ఇవ్వగానే ట్యాక్సీ బాడుగ మాట్లాడుతుండగా రవితేజను దబాయిస్తాడు. కూతురు ఒక్కతే వచ్చింది.. తల్లి ఎక్కడ.. అంటూ డైలాగ్స్ వేస్తాడు. తర్వాత రవితేజ వీళ్లందరినీ కొట్టే సీన్ లో ప్రభాస్ శ్రీను చివర్లో ఉండి చేసే యాక్షన్ తెలుగు ప్రేక్షకులు ఎప్పటికీ మరువలేరు. అయితే ఆ సినిమా సందర్భంగా ఎదురైన అనుభవాలను ప్రభాస్ శ్రీను తాజాగా ఓ ఇంటర్వ్యూలో పంచుకున్నాడు.

విక్రమార్కుడు సినిమా షూటింగ్ సందర్భంగా తాను రియల్ గా దెబ్బలు తిన్నానని తెలిపాడు. అంత అవసరం ఏంటని యాంకర్ ప్రశ్నించగా.. రాజమౌళి సినిమాలంటే అంతే.. సీన్ పర్ ఫెక్ట్ గా రావాల్సిందే.. అందుకోసం ఏం చేయడానికైనా సిద్ధపడతాడు.. అంటూ ప్రభాస్ శ్రీను చెప్పుకొచ్చాడు. ఇంకా హీరో ప్రభాస్ గురించి కూడా అనేక విషయాలు పంచుకున్నాడు.

ప్రభాస్ అంటే మంచి తనానికి మారుపేరుగా అభివర్ణించాడు. ప్రభాస్ కు మంచితనమంటే పిచ్చి అని చెప్పాడు. అది అతని బ్లడ్ లోకి వెళ్లిపోయిందన్నాడు. అది చిన్నతనం అనుకోవాలో, చిలిపితనం అనుకోవాలో.. అన్నీ కలిసిన వ్యక్తిత్వమే డార్లింగ్ ప్రభాస్ అని చెప్పాడు. కరోనా సమయంలో తాను చాలా పాఠాలు నేర్చుకున్నానని తెలిపాడు. ఆడవారి ప్రేమను అర్థం చేసుకున్నానని చెప్పాడు. అందరం కలిసి వినాయక చవితి పండగ చేసుకున్నామన్నాడు.

సినిమాల్లో, బయట కూడా అందరితో సరదాగా గడపడం తనకు ఇష్టమని చెప్పాడు ప్రభాస్ శ్రీను. తాను ఇప్పటి వరకు ఏ హీరోతోనూ గొడవ పడలేదన్నాడు. సరదాగా వెళ్లి షూటింగ్ చేసుకొని వచ్చే వాడినని తెలిపాడు. ఛత్రపతి సినిమా సమయంలో క్యారవ్యాన్ సంస్కృతి ఉండేది కాదని, చిన్న బెడ్ మాత్రమే రెస్ట్ తీసుకోవడానికి కేటాయించేవారన్నన్నాడు.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -