Curd: పెరుగులో ఇవి కలుపుకొని తింటే వాటి నుంచి ఉపశమనం!

Curd: పెరుగు తినేందకు ప్రతి ఒక్కరూ ఇష్టపడుతారు. తరచూ పెరుగు తినడంతో ఆరోగ్యం పదిలంగా ఉంటుందని నిపుణులు సూచిస్తుంటారు. పాల ఉంచి∙తయారయ్యే పదార్థాల్లో పెరుగు ఒకటి. దీనిని కూడా మనం ఆహారంగా తీసుకుంటాం. పెరుగులో ఎన్నో ఆరోగ్యకరమైన ప్రయోజనాలు ఉంటాయి. అందుకే పెరుగును ఇష్టంగా తింటారు. ఎందుకంటే పెరుగులో మన శరీరానికి మేలు చేసే బ్యాక్టీరియా ఉంటుంది. పొట్ట ఆరోగ్యానికి ఈ బ్యాక్టీరియా ఎంతో మంచిది. ప్రస్తుతం ఉన్న ఆహారపు అలవాట్ల మంచి బ్యాక్టీరియాను కోల్పోతున్నాం. కనుక మంచి బ్యాక్టీరియా పుష్కలంగా లభించే పెరుగును తీసుకోవడం వల్ల జీర్ణక్రియ సమస్యలు తొలగిపోతాయి.

కాబట్టి రోజువారి ఆహారంలో పెరుగును తప్పకుండా తీసుకోవాలి. కొందరు రాత్రిపూట పెరుగును తినకూడదంటారు. కానీ రాత్రిపూట కూడా పెరుగును నిరభ్యంతరంగా తినవచ్చని నిపుణులు భరోసా ఇస్తున్నారు. అయితే జలుబు, దగ్గు, అలర్జీలతో బాధపడే వారు మాత్రం రాత్రిపూట పెరుగును తీసుకోకపోవడమే మంచిదట. పెరుగు కఫానికి కారణమవుతుందని జలుబు, దగ్గు వంటి వాటితో బాధపడే వారు రాత్రిపూట పెరుగు తినకపోవడమే మంచిదట. దగ్గు మరియు జలుబులతో బాధపడే వారు రాత్రిపూట పెరుగు తీసుకోవడం వల్ల శ్లేష్మం వృద్ధి చెందుతుంది. ఒకవేళ పెరుగు తీసుకోకుండా ఉండలేని పక్షంలో పలుచటి మజ్జిగను తీసుకోవచ్చు. ఈ మజ్జిగలో చిటికెడు ఉప్పు, చిటికెడు జీలకర్ర పొడిని వేసి కలిపి తాగితే మరింత మేలు కలుగుతుంది.

ఎండాకాలంలో పెరుగన్నం తింటే శరీరానికి చల్లదనం ఉంటుంది.పెరుగులో కొద్దిగా నీటిని కలిపిన తర్వాతే మాత్రమే పెరుగును ఆహారంగా తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. రాత్రి పూట పెరుగు తినే వారు అందులో పంచదార లేదా మిరియాల పొడి కలుపుకుని తాగడం వల్ల పొట్టకు హాయిగా ఉంటుంది. పొరపాటున కూడా పెరుగును వేడి చేసి తీసుకోకూడదు. వేసవి కాలంలో అయితే పెరుగన్నం తినడం అలవాటు చేసుకోవాలి. పెరుగులో పంచదార వేసి లస్సీ లాగా చేసుకుని కూడా తీసుకోవచ్చు. అంతేకాకుండా పెరుగులో టమాటా ముక్కలు, ఉల్లిపాయ ముక్కలు వేసి పెరుగు చట్నీ చేసుకుని కూడా తినవచ్చు.

Related Articles

ట్రేండింగ్

Janasena Glass Symbol Confusion: గాజు గ్లాస్ గందరగోళం వెనుక తప్పెవరిది.. జనసేనకు చేటు చేయాలనే కుట్ర చేశారా?

Janasena Glass Symbol Confusion: ఎన్నికలు సమీపిస్తున్నటువంటి తరుణంలో ప్రజలందరికీ కూడా ఓట్లు వేసే విధానంపై అవగాహన కల్పిస్తున్నారు. అయితే పార్టీలకు గుర్తింపు ఉంటే ఆ పార్టీ సింబల్ ను అధికారకంగా రిజర్వ్...
- Advertisement -
- Advertisement -