Writer Lakshmi Bhupal: చిరంజీవి గొప్పతనం గురించి ఆధారాలతో బయటపెట్టిన గాడ్ ఫాదర్ డైలాగ్ రైటర్..?

Writer Lakshmi Bhupal: మెగాస్టార్ చిరంజీవి ..టాలీవుడ్ ఇండస్ట్రీలో ఈ పేరు గురించి తెలియని వారంటూ ఉండరు. ఎటువంటి సపోర్ట్ లేకుండా ఇండస్ట్రీలో అడుగుపెట్టిన చిరంజీవి ఒక్కో మెట్టు ఎక్కుతూ మెగాస్టార్ గా గుర్తింపు పొంది అందరికీ ఆదర్శంగా నిలుస్తున్నాడు. ఇలా 150 కి పైగా సినిమాలలో నటించిన మెగాస్టార్ ఇప్పటికి వరుస సినిమాలలో నటిస్తూ కుర్ర హీరోలకు పోటీ ఇస్తున్నాడు. ఇటీవల చిరంజీవి నటించిన గాడ్ ఫాదర్ సినిమా అక్టోబర్ 5వ తేదీన దసరా కానుకగా ప్రేక్షకుల ముందుకి వచ్చింది.

ఈ సినిమా విడుదలైన మొదటి రోజు నుండి ప్రేక్షకుల ఆదరణ సొంతం చేసుకుని బాక్సాఫీస్ వద్ద వసూళ్ల వర్షం కురిపిస్తోంది. సినిమా సక్సెస్ అవటంతో ఈ సినిమాలో డైలాగ్ రైటైర్ గా పని చేసిన లక్ష్మీ భూపాల ఇటీవల ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. ఈ ఇంటర్వ్యూలో లక్ష్మీ భూపాల సినిమా గురించి ఎన్నో ఆసక్తికర విషయాలను వెల్లటించడమే కాకుండా మెగాస్టార్ చిరంజీవి గారి గొప్పతనం గురించి కూడా అందరికీ అర్థం అయ్యేలా సాక్షాలతో సహా వివరించాడు.

ఈ ఇంటర్వ్యూ లో లక్ష్మీ భూపాల మాట్లాడుతూ.. మెగాస్టార్ గా గుర్తింపు పొంది ఇండస్ట్రీలో అగ్రస్థానంలో ఉన్న చిరంజీవి అందరికీ ఆదర్శంగా నిలుస్తూన్నా కూడా ఎప్పటికీ ఒక విద్యార్థి లాగా కొత్త విషయాలను నేర్చుకుంటూ ఉంటాడని చెప్పుకొచ్చాడు .అంతే కాకుండా చిరంజీవి సెట్ లో ఎలా ఉంటారో..? ఎంత నిబద్దతతో పని చేస్తాడు అన్న విషయం గురించి కూడా వివరించాడు. అందుకు ఉదాహరణగా షూటింగ్ సమయంలో జరిగిన ఒక సందర్భం గురించి తెలియజేశారు.

చిరంజీవి గారు10 పేజీల డైలాగ్‌ ఉన్నా కూడా పదం మర్చిపోకుండా ఆ డైలాగులను నేర్చుకునే చెప్తారు అంటూ ఆయన డైలాగ్‌ నేర్చుకుంటున్న సమయంలో సెట్ లో తీసిన ఒక ఫోటోని సాక్ష్యంగా చూపించాడు. అంతే కాకుండా డైలాగ్ లో ఒక పదం అటు ఇటు అయితే డబ్బింగ్ లో మ్యానేజ్ చేయకుండా డైలాగ్ పర్ఫెక్ట్ గా రావాలని మరొక షాట్ తీయించాడు ‘ అంటూ మెగాస్టార్ చిరంజీవి గొప్పతనం గురించి డైలాగ్ లక్ష్మీ భూపాల ఎంతో గొప్పగా చెప్పుకొచ్చాడు.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -