Tollywood: భార్య భర్తలుగా నటించిన ఈ జంటలు అన్నా చెల్లెలుగా కూడా నటించారని తెలుసా..?

Tollywood: సాధారణంగా హీరో, హీరోయిన్లు క్యారెక్టర్ ఆర్టిస్టులు ఎప్పుడు ఒకే తరహా పాత్రలలో నటించటానికి వీలుండదు. ఒక సినిమాలో ఒక్కో రకమైన పాత్రలో నటించాల్సి ఉంటుంది. ఇలా కొన్ని సినిమాలలో భార్య భర్తలుగా నటించిన కొంతమంది హీరో హీరోయిన్లు మరికొన్ని సినిమాలలో అన్నా చెల్లెలుగా కూడా నటించి ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. ఇలా ఈ భార్యాభర్తలుగా నటించి ఆ తర్వాత అన్నా చెల్లెలుగా నటించిన జంటల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

• చిరు – నయన్ : చిరంజీవి హీరోగా నటించిన సైరా సినిమాలో చిరంజీవి భార్యగా నటించిన నయనతార ఇటీవల విడుదలైన గాడ్ ఫాదర్ సినిమాలో చిరంజీవికి చల్లిగా నటించింది.

• చిరు – రమ్యకృష్ట : ముగ్గురు మొనగాళ్లు సినిమాలో చిరంజీవికి జోడిగా నటించిన రమ్యకృష్ణ ” చక్రవర్తి” సినిమాలో చిరుకి చెల్లెలిగా నటించింది.

ప్రకాష్ రాజ్ – జయసుధ : బొమ్మరిల్లు, కొత్త బంగారులోకం వంటి సినిమాలలో భార్యాభర్తలుగా నటించిన వీరిద్దరూ.. ” సోలో” సినిమాలో మాత్రం అక్కా తమ్ముడిగా నటించారు.

• కృష్ణ – సౌందర్య : ఎన్నో సినిమాలలో హీరో, హీరోయిన్లుగా నటించిన కృష్ణ, సౌందర్య ” రవన్న” సినిమాలో మాత్రం అన్నా, చెల్లెలుగా నటించారు.

చంద్రమోహన్ – సుధా: ఎన్నో సినిమాలలో భార్య భర్తలుగా నటించిన వీరిద్దరూ..”నువ్వు నాకు నచ్చావ్” సినిమాలో అన్నా, చెల్లెలుగా నటించారు.

• సురేష్ – సౌందర్య: అమ్మోరు సినిమాలో భార్య భర్తలుగా నటించిన వీరిద్దరూ.. ” దేవీపుత్రుడు” సినిమాలో అన్నా చెల్లెలుగాా నటించారు.

రాజేంద్రప్రసాద్ – రంభ : ఆ ఒక్కటి అడక్కు సినిమాలో జంటగా నటించిన వీరిద్దరూ.. హిట్లర్ సినిమాలో అన్నా చెల్లెలుగా నటించారు.

• రమ్యకృష్ణ – నాజర్ : “నరసింహ” సినిమాలో అన్నా, చెల్లెలుగా నటించిన వీరిద్దరూ ” బాహుబలి” సిరీస్ లో భార్యాభర్తలు గా నటించారు.

Related Articles

ట్రేండింగ్

YSRCP Leaders Tension: టీడీపీ జనసేన కూటమి మేనిఫెస్టో విషయంలో వైసీపీ భయాలివేనా.. ఆ టెన్షన్ తగ్గట్లేదా?

YSRCP Leaders Tension:తెలుగుదేశం పార్టీ మేనిఫెస్టో విడుదల చేసిన తర్వాత జగన్ పార్టీలో భయం మొదలైనట్లుగా ఉంది. ఎందుకంటే వైసీపీ మేనిఫెస్టోలో ఉన్నా హామీల కన్నా కూటమి ఇచ్చిన హామీలు చాలా చాలా...
- Advertisement -
- Advertisement -