Ganta Srinivasa Rao: పవన్‌తో టచ్‌లోకి గంటా శ్రీనివాసరావు? జనసేనలోకి జంప్?

Ganta Srinivasa Rao: విశాఖకు జిల్లాకు చెందిన టీడీపీ ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు జనసేనలో చేరేందుకు సిద్దమైనట్లు ప్రచారం జరుగుతోంది. గత ఎన్నికల్లో విశాఖ జిల్లాలో ఆయన టీడీపీ ఎమ్మెల్యేగా గెలిచారు. టీడీపీ అధికారంలోకి రావడంతో ఆయన పార్టీకి దూరంగా ఉంటున్నారు. టీడీపీకి అంటీముంటనట్లుగానే ఉంటున్నారు. టీడీపీ కార్యక్రమాల్లో కూడా ఎక్కడా పాల్గొనడం లేదు. టీడీపీ నేతలతో కూడా టచ్ లో లేకుండా ఉన్నారు. రాజకీయంగా కూడా గంటా శ్రీనివాసరావు సైలెంట్ అయ్యారు. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ ఎమ్మెల్యే పదవికి ఆయన రాజీనామా చేశారు. కానీ ఆ రాజీనామా ఆమోదం పొందలేదు. రాజకీయ కార్యక్రమాలకు కూడా ఆయన దూరంగా ఉన్నారు.

మీడియాతో కూడా గంటా శ్రీనివాసరావు ఎక్కడా కనిపిచడం లేదు. ప్రజా సమస్యలపై, మూడు రాజాధానుల అంశం ఏపీలో దుమారం రేగుతున్నా ఆయన స్పందించలేదు. వైసీపీ ప్రభుత్వ పాలనపై ఆయన అసలు స్పందించడం లేదు. కానీ వచ్చే ఎన్నికల్లో టీడీపీకి ఆయన గుడ్ బై చెప్పనునన్నారని, జనసేన నుంచి పోటీ చేయనున్నారనే ప్రచారం జరుగుతోంది. ఇటీవల చిరంజీవితో గంటా శ్రీనివాసరావు భేటీ కావడం ఆసక్తికరంగా మారింది. జనసేనలో చేరేందుకే చిరంజీవిని కలిశారని చెబుతున్నారు. గంటా శ్రీనివాసరావు జనసేనలో చేరికకు చిరంజీవి మధ్యవర్తిగా వ్యవహరిస్తున్నారని చెబుతున్నారు.

గంటా శ్రీనివాసరావును జనసేనలో చేర్చుకోవాల్సిందిగా పవన్ కు చిరంజీవి రిఫర్ చేసినట్లు ప్రచారం సాగుతోంది. దీంతో చిరంజీవి రాయబారంతో పవన్ తో గంటా శ్రీనివాసరావు టచ్ లోకి వెళ్లినట్లు టాక్ వినిపిస్తోంది. చిరంజీవి సూచతో గంటాను జనసేనలో చేర్చుకునేందుకు పవన్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు వార్తలు వస్తున్నాయి. త్వరలోనే గంటా జనసేన కండువా కప్పుకుంటారని ఊహాగనాలు వినిపిస్తున్నాయి. గతంలో ప్రజారాజ్యం పార్టీ నుంచి గంటా ఎమ్మెల్యేగా గెలిచారు. ఆ తర్వాత 2014లో టీడీపీలో చేరి ఆ పార్టీ నుంచి ఎమ్మెల్యేగా విజయం సాధించారు. టీడీపీ హయాంలో విద్యాశాఖ మంత్రిగా పనిచేశారు. కానీ 2019 ఎన్నికల్లో టీడీపీ ఓడిపోవడంతో ఆయన ఆ పార్టీకి దూరమయ్యారు.

అధికారంలో ఏ పార్టీలో ఉంటే ఆ పార్టీలోకి గంటా వెళతారనే అపవాదు ఉంది. ఆయన అధికారంలో ఉన్న పార్టీలకే జై కొడతారనే విమర్శలు ఉన్నాయి. అందులో భాగంగా గంటా వైసీపీలో చేరుతారనే ప్రచారం కూడా జరిగింది. గంటాకు సన్నిహితుడైన అవంతి శ్రీనివాస్ వైసీపీలో చేరారు. అవంతి శ్రీనివాస్ ను గంటానే వైసీపీలోకి పంపించారనే ప్రచారం అప్పట్లో జోరగా జరిగింది. త్వరలో గంటా కూడా వైసీపీ గూటిక చరుతారనే ప్రచారం జోరరుగా జరిగింది. కానీ కొన్ని పరిణామాల వల్ల ఆయన వెళ్లలేదు. కానీ ప్రస్తుతం రాష్ట్రంలో జనసేన పుంజుకుటుండంతో ఆ పార్టీకి వైపు చాలామంది చూస్తన్నారు. ఇతర పార్టీలోని చాలామంది అసంతృప్తి నేతలు జనసేన వైపు చూసేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. విశాఖ జిల్లాలో పాటు ఉభయగోదావరి జిల్లాలో జనసేన బలంగా పుంజుకుంటున్నట్లు సర్వేలు చెబుతున్నాయి. దీంతో ఆ పార్టీ వైపు చాలామంది నేతలు చూస్తున్నారు.

Related Articles

ట్రేండింగ్

YSRCP Leaders Tension: టీడీపీ జనసేన కూటమి మేనిఫెస్టో విషయంలో వైసీపీ భయాలివేనా.. ఆ టెన్షన్ తగ్గట్లేదా?

YSRCP Leaders Tension:తెలుగుదేశం పార్టీ మేనిఫెస్టో విడుదల చేసిన తర్వాత జగన్ పార్టీలో భయం మొదలైనట్లుగా ఉంది. ఎందుకంటే వైసీపీ మేనిఫెస్టోలో ఉన్నా హామీల కన్నా కూటమి ఇచ్చిన హామీలు చాలా చాలా...
- Advertisement -
- Advertisement -