Kalyan Dev: మూడో పెళ్లికి సిద్ధమైన కళ్యాణ్ దేవ్.. మెగా ఫ్యామిలీకి పెద్ద షాకిచ్చాడుగా!

Kalyan Dev: తెలుగు సినిమా ఇండస్ట్రీలో మెగా కుటుంబానికి ఎంతటి పేరు ప్రఖ్యాతలు ఉన్నాయో మనకు తెలిసిందే. ఎలాంటి సినీ బ్యాగ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న చిరంజీవి ఎంతో మందికి స్ఫూర్తిదాయకం. ఇలా ఎంతోమంది తన ఇన్స్పిరేషన్ తో ఇండస్ట్రీలోకి వస్తున్నామని తెలియజేశారు. ఈ విధంగా చిరంజీవి ఇంటిపేరు ప్రఖ్యాతలను నిలబెట్టగా శ్రీజ మాత్రం తన కుటుంబ పరువు తీసే పనిలో బిజీగా ఉన్నారు.

చిరంజీవి చిన్న కుమార్తె కావడంతో ఈమెను ఎంతో గారాభం చేసి పెంచారు. అయితే ఆగారాభమే ఇప్పుడు తనని సమస్యలలోకి నెట్టివేసిందని తెలుస్తుంది. శ్రీజ కాలేజీ చదువుతున్న సమయంలోనే శిరీష్ భరద్వాజ్ అనే వ్యక్తిని ప్రేమించి పారిపోయి పెళ్లి చేసుకున్నారు. అయితే ఒక బిడ్డకు జన్మనిచ్చిన తర్వాత తనతో మనస్పర్ధలు రావడం తిరిగి ఆయనకు విడాకులు ఇచ్చి చిరంజీవి ఇంటికి చేరుకున్నారు.

ఇకపోతే మెగాస్టార్ చిరంజీవి దగ్గరుండి తన కుటుంబ సభ్యుల సమక్షంలో శ్రీజకు కళ్యాణ్ దేవ్ అనే వ్యక్తితో రెండవ వివాహం చేశారు.ఇక వీరి వైవాహిక జీవితం సవ్యంగా సాగిపోతుందనుకున్న సమయంలో ఇద్దరు మధ్య మనస్పర్ధలు రావడంతో వీరు కూడా విడాకులు తీసుకున్నారని వార్తలు వస్తున్నాయి.ఇక ఈ వార్తల గురించి అధికారకంగా ప్రకటించకపోయిన శ్రీజ కళ్యాణ్ దేవ్ మాత్రం విడివిడిగా ఉంటున్నారని తెలుస్తోంది.

ఇక కళ్యాణ్ దేవ్ కూడా సోషల్ మీడియాలో ఎంతో యాక్టివ్ గా ఉంటూ తనకు సంబంధించిన అన్ని విషయాలను అభిమానులతో పంచుకుంటున్నారు. ఈ క్రమంలోనే తాజాగా ఓ అమ్మాయితో కలిసి దిగిన ఫోటోలను ఇంస్టాగ్రామ్ స్టోరీ ద్వారా షేర్ చేస్తూ… నా జీవితాన్ని మార్చేసిన కలల రాణి అంటూ పోస్ట్ చేశారు. ఇలా పోస్ట్ చేయడంతో తాను మరో పెళ్లికి సిద్ధమయ్యారని తెలుస్తోంది.ఇలా మరో పెళ్లికి సిద్ధమయ్యారు అంటే శ్రీజతో విడాకులు తీసుకున్నారని అర్థం కదా అంటూ అభిమానులు సందేహం వ్యక్తం చేస్తున్నారు.మొత్తానికి కళ్యాణ్ దేవ్ మెగా కుటుంబానికి భారీగా షాక్ ఇచ్చారని మరికొందరు కామెంట్లు చేస్తున్నారు.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -