Sweets: కల్తీ స్వీట్లుతో జాగ్రత్తగా ఉండండి.. నిపుణుల హెచ్చరిక!

Sweets:  మరికొద్ది రోజుల్లో దేశవ్యాప్తంగా దీపావళి పండుగ సంబరాలు షురూ అవుతాయి. ఇప్పటికే పండుగ సందడి నెలకొంది. రోడ్లకు ఇరువైపులా దీపావళి పండుగ సామన్లు, టపాసులు స్టాళ్లు వెలిశాయి. స్వీట్ షాపుల్లో మిఠాయిల తయారీలు పెరిగాయి. అయితే దీపావళి పండుగలో స్వీట్లకు మంచి డిమాండ్ ఉంటుంది. వినియోగదారుల ఇష్టాలను దృష్టిలో పెట్టుకుని స్వీట్ షాపుల యజమానులు పలు రకాల స్వీట్లను తయారు చేస్తారు. అయితే డిమాండ్ ఎక్కువగా ఉన్న నేపథ్యంలో కల్తీ ఎక్కువగా జరిగే ప్రమాదం ఉంది. ఈ నేపథ్యంలో స్వీట్లు కొనుగోలు చేసేటప్పుడు జాగ్రత్తలు పాటించాలని నిపుణులు సూచిస్తున్నారు.

దీపావళి పండుగ సందర్భంగా ఢిల్లీ ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుంటోంది. మిఠాయి షాపులపై విస్తృతంగా తనిఖీలు నిర్వహించేలా చర్యలు తీసుకుంటున్నారు. పాల ఉత్పత్తుల్లో కల్తీ ఎక్కువగా జరుగుతోందని గుర్తించడంతోపాటు ఆయా షాపులకు షోకాజ్ నోటీసులు కూడా జారీ చేశారు. కాగా దీపావళి పండుగ సీజన్‌లో కల్తీ ఆహారానికి చెక్ పెట్టేందుకు ఫుడ్ అండ్ డ్రగ్స్ అడ్మినిస్ట్రేషన్ విభాగం ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేసింది. ఫుడ్ సేఫ్టీ అధికారి ఏకే సింగ్ నేతృత్వంలో మొత్తం 8 బృందాలు మోరీ గేట్, ఫతేపురి తదితర ప్రాంతాల్లో తనిఖీలు నిర్వహించారు.

కల్తీ ఆహారం తీసుకోవడం వల్ల కాలేయం, మూత్ర పిండాలపై తీవ్ర ప్రభావం చూపుతుంది. దీంతో ఆరోగ్యం పూర్తిగా దెబ్బతింటుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. కాలేయ సమస్యలు, కడుపు సంబంధిత సమస్యలు, విరేచనాలు, వాంతులు, గుండె వ్యాధులు, ఫుడ్ పాయిజనింగ్ వంటి సమస్యలు వచ్చే ప్రమాదం ఉంది. ‘ఆహారాన్ని ఆకర్షణీయంగా తయారు చేయడానికి ఆహారంలో కల్తీ రసాయనాలు కలుపుతారు. ఆహారాన్ని మెత్తగా చేయడానికి, మంచి షేప్‌లో రావడానికి పిండి పదార్థాలను కూడా జోడిస్తారు. మసాలాలు, రంగు, రుచిని కూడా కలుపుతారు. వీటిని తీసుకోవడం వల్ల జీర్ణాశయం వీటిని అరగించలేదు. ఇవి శరీరానికి టాక్సిన్స్ గా పని చేస్తాయి. వీటికి దూరంగా ఉంటేనే మంచింది.’ అని న్యూట్రిషనిస్ట్ మంజరి చంద్ర తెలిపారు.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -