Dementia: ఎక్కువగా నిద్రపోతున్నారా? అయితే ఇది చదవండి

Deep Sleep: మనలో చాలామందికి నిద్ర అంటే ఎంతో ప్రేమ ఉంటుంది. అదేదో సినిమాలో చెప్పినట్లు.. మనకు నచ్చినవి నిద్ర, తినడం లాగా చాలామందికి నిద్రపోవడం అంటే ఇష్టం ఉంటుంది. నిజానికి మన శరీరానికి తగినంత నిద్ర లేకపోతే అనేక సమస్యలు తలెత్తుతాయి. నిద్ర సరిగ్గా ఉంటే శరీరం అన్ని రకాలుగా బాగుంటుందని వైద్యులు చెబుతుంటారు.

అయితే అదే సమయంలో అతిగా నిద్రపోతే కూడా మంచిది కాదని వైద్యులు హెచ్చరిస్తున్నారు. తాజాగా వెల్లడైన అధ్యయనంలో అతి నిద్ర వల్ల సమస్యలు తప్పవనే విషయం వెల్లడైంది. మరీ ముఖ్యంగా ముసలి వాళ్లలో సమస్యలు వస్తాయని అధ్యయనంలో తేలింది. అతిగా నిద్రపోయే వారిలో డిమెన్షియా (చిత్త వైకల్యం) ఏర్పడుతుందని అధ్యయనంలో వెల్లడైంది.

సాధారణంగా ఒక మనిషికి ఆరు గంటల నిద్ర ఉంటే సరిపోతుంది. అయితే ఆరు గంటల కన్నా ఎక్కువ నిద్ర వల్ల నష్టం కలుగుతుందని తేలింది. మరీ ముఖ్యంగా 8గంటల కంటే ఎక్కువగా నిద్రపోతే డిమెన్షియా రిస్క్ ఉందని తేలింది. అందులోనూ ముసలివారిలో ఇది ఎక్కువగా ఉందని తాజాగా సర్వేలో తేలింది. 69శాతం ముసలివారిలో ఎక్కువగా డిమెన్షియా రిస్క్ ఉందని అధ్యయనంలో ఫలితాలు వచ్చాయి.

రాత్రి 9గంటలకు ముందు 10 గంటల తర్వాత నిద్రపోయే వారికి డిమెన్షియా రిస్క్ రెండింతలు ఉంటుందని అధ్యయనంలో తేలింది. చైనాలోని గ్రామీణ ప్రాంతాల్లో నిర్వహించిన అధ్యయనంలో ఈ విషయాలు వెల్లడయ్యాయి. డిమెన్షియా వల్ల పరోక్షంగా మేధా శక్తి దెబ్బతింటుందని అలాగే ప్రవర్తనా తీరు కూడా మారుతుందని అధ్యయనంలో తేలింది.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -