Dates: పిల్లలు నిద్రలో మూత్ర విసర్జన చేస్తే ఇవి తినిపించండి!

Dates: ఖర్జూరాలు అంటే చాలా మంది ఇష్టమే ఉంటుంది. చిన్నారుల నుంచి పెద్దల వరకు వీటిని చాలా మంది ఇష్టంగా తింటారు. అయితే ఖర్జూరాలను రోజుకు 3 చొప్పున తినడం వల్ల మనకు అనేక లాభాలు కలుగుతాయి. ఖర్జూరాలను తినడం అలవాటు చేసుకుంటే వాటితో అనేక ప్రయోజనాలను పొందవచ్చు. నార్త్‌ డకోటా స్టేట్‌ యూనివర్సిటీ ప్రొఫెసర్‌ జూలీ గార్డెన్‌ రాబిన్‌సన్‌ చేసిన పరిశోధనల ప్రకారం నిత్యం ఖర్జూరాలను తినడం వల్ల ఎముకలు ఆరోగ్యంగా ఉంటాయి.

వాటిల్లో ఉండే బోరాన్‌ అనే సమ్మేళనంతోపాటు ఫాస్ఫరస్, పొటాషియం, కాల్షియం, మెగ్నీషియం ఎముకలను దృఢంగా మారుస్తాయి. దీనివల్ల ఎముకలు గుల్లగా మారిపోయే ఆస్టియోపోరోసిస్‌ వంటి వ్యాధులు రాకుండా ఉంటాయి.నిత్యం ఖర్జూరాలను తినడం వల్ల జీర్ణ వ్యవస్థ పనితీరు మెరుగు పడుతుంది. అజీర్ణం, మలబద్దకం ఉండవు. ఖర్జూరాలలో విటమిన్‌ బీ–6 ఉంటుంది. ఇది శరీరంలో సెరొటోనిన్, నోర్‌పైన్‌ఫ్రై న్‌ అనే హ్యాపీ హార్మోన్లను ఉత్పత్తి చేస్తుంది. దీంతో డిప్రెషన్, ఒత్తిడి, ఇతర మానసిక సమస్యలు తగ్గుతాయి. ఖర్జూరం తినడం వల్ల బహిష్టు సమయంలో వెన్నునొప్పి నుంచి ఉపశమనం లభిస్తుంది.

పిల్లలు నిద్రలో మూత్ర విసర్జన చేస్తుంటే ఖర్జూరం తో పాటు పాలు ఇస్తే ఆ సమస్య మళ్లీ రాదు. ఖర్జూరంతో కాచిన పాలను ఉదయం, సాయంత్రం తాగితే తక్కువ రక్తపోటు నుంచి బయటపడతారు.తీపి పదార్థాలు, చక్కెర మొదలైనవి నిషేధించబడిన మధుమేహ రోగులు పరిమిత పరిమాణంలో ఖర్జూరం పాయసం తీసుకోవచ్చు.ఖర్జూరపు ముద్దలను కాల్చి బూడిద చేయండి. ఈ భస్మాన్ని గాయాలపై పూస్తే గాయాలు మానుతాయి.ఎండు ఖర్జూరాలను నెయ్యిలో వేయించి రోజుకు 2–3 సార్లు తీసుకుంటే దగ్గు నుండి ఉపశమనం కలుగుతుంది. ఖర్జూరపు పొడిని నీళ్లలో నూరి తలకు పట్టించడం వల్ల తలలోని పేను నశిస్తుంది.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: జగన్ అధికారంలోకి వస్తే ఏపీ ప్రజల భూములు పోతాయా.. బాబు చెప్పిన విషయాలివే!

Chandrababu Naidu: జగన్ మరొకసారి అధికారంలోకి వస్తే ప్రజల భూములను అధికారికంగా కబ్జా చేస్తారని భయం ప్రజల్లో పట్టుకుంది. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి తీసుకువచ్చిన భూ యాజమాన్య హక్కు చట్టం కబ్జాదారులకు అక్రమార్కులకు...
- Advertisement -
- Advertisement -