Chiranjeevi: ఆ పార్టీలో చేరడానికి మెగాస్టార్ కు ఆహ్వానం.. కానీ?

Chiranjeevi: మెగాస్టార్ చిరంజీవిని చిత్రసీమలో ఇండస్ట్రీ పెద్దగా అందరూ పిలుస్తారు. అయితే, రాజకీయాల్లోనూ, రాజకీయ నేతల్లోనూ చిరంజీవికి చాలా మందితో సత్సంబంధాలున్నాయి. ముఖ్యంగా ఏపీ సీఎం వైఎస్ జగన్ తోనూ, ఇటు తెలంగాణ సీఎం కేసీఆర్ తోనూ స్నేహంగా ఉంటారు చిరంజీవి. కేసీఆర్ తనయుడు కేటీఆర్ తోనూ సరదాగా ఉంటారు మెగాస్టార్.

అంతకుముందు సొంతంగా ప్రజారాజ్యం పార్టీని స్థాపించిన మెగాస్టార్.. తదుపరి పరిణామాలతో కాంగ్రెస్ లో విలీనం చేశారు. అనంతరం కేంద్ర మంత్రి అయ్యారు. ఇప్పుడు తెలంగాణలో టీఆర్ఎస్ లో చేరుతారా అనే ఊహాగానాలు వెలువడుతున్నాయి. ఇందుకు కారణం లేకపోలేదు. తెలంగాణ మంత్రి మల్లారెడ్డి చేసిన వ్యాఖ్యలే ఇందుకు నిదర్శనంగా నిలుస్తున్నాయి.

తాజాగా మల్లారెడ్డి యూనివర్సిటీలో ఇస్కాన్ సంస్థ ఆధ్వర్యంలో కిల్ క్యాన్సర్ అవేర్ నెస్ కార్యక్రమం చేపట్టారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మెగాస్టార్ చిరంజీవి హాజరయ్యారు. ఇక చిరంజీవి వస్తున్నారంటే ఫ్యాన్స్ లో ఉత్సాహం ఓ రేంజ్ లో ఉంటుంది. ఈ కార్యక్రమానికి వచ్చిన చిరంజీవిపై మంత్రి మల్లారెడ్డి ప్రశంసల వర్షం కురిపించారు.

చిరంజీవి కేసీఆర్ కు అండగా నిలవాలి..

మంత్రి మల్లారెడ్డి మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి కేసీఆర్ కు చిరంజీవి అండగా నిలవాలని కోరారు. దేశ రాజకీయాల్లోకి వెళ్తూ కేసీఆర్ బీఆర్ఎస్ పార్టీని పెడుతున్న నేపథ్యంలో.. బీఆర్ఎస్ పార్టీలో చేరాలని పరోక్షంగా చిరంజీవిని మంత్రి మల్లారెడ్డి ఆహ్వానించారు. అయితే, మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం రాజకీయంగా తటస్థంగా ఉన్నారు. సోదరుడు పవన్ కల్యాణ్ ఏపీలో అధికార పక్షంపై విరుచుకుపడుతున్నా.. చిరంజీవి అటువైపు కామెంట్ చేయడం లేదు. పైగా సీఎం జగన్ తో కలిసి భేటీ అవుతున్నారు. ఇటీవల వైసీపీ చిరంజీవికి రాజ్యసభ పదవి కూడా ఆఫర్ చేసిందనే వార్తలు వచ్చాయి. ఇలాంటి సమయంలో ఏ పార్టీ నుంచి ఆహ్వానం అందినా చిరంజీవి వెళ్లే పరిస్థితి లేదంటున్నారు నిపుణులు.

Related Articles

ట్రేండింగ్

Nara Lokesh-Murugudu Lavanya: మంగళగిరిలో సీన్ సితారే.. లోకేశ్ దెబ్బకు వైసీపీ లావణ్య సైలెంట్ అయ్యారా?

Nara Lokesh-Murugudu Lavanya: 2019 ఎన్నికలలో నారా లోకేష్ వైసీపీ నేత ఆళ్ళ రామకృష్ణారెడ్డి చేతిలో మంగళగిరి అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పోటీ చేసి చాలా తక్కువ ఓట్లు తేడాతో ఓడిపోయారు. అయితే...
- Advertisement -
- Advertisement -