Black Kismis: ఆ రోగం పోవాలంటే వీటిని ప్రతి రోజూ తినాల్సిందే!

Black Kismis: కిస్మిస్‌ ప్రతి ఇంట్లో ఉంటుంది.స్వీట్స్, పాయసం, ఇతర వంటకాల్లో కచ్చితంగా కిస్మిస్‌ను వాడుతారు. తీపి వంటకాల్లో కిస్మిస్ వేస్తే రుచితో పాటు ఆరోగ్యంగా ఉంటుందని ఆహార నిపుణులు సూచిస్తున్నారు. మెరుగైన ఆరోగ్యం కోసం పోషక పదార్థాలు పుష్కలంగా లభించే పదార్థాలు తప్పకుండా తీసుకోవాలి. డ్రై ఫ్రూట్స్ ఇందులో ముఖ్యమైనవి. డ్రైఫ్రూట్స్‌లో బ్లాక్ కిస్మిస్‌ చాలా ప్రయోజనాలున్నాయి. బ్లాక్ కిస్మిస్‌ను రాత్రంతా నానబెట్టి ఉదయం తీసుకుంటే జీర్ణక్రియ మెరుగుపడుతుంది. అజీర్తి నుంచి ఉపశమనం కలుగుతుంది. కిస్మిస్‌ను డైట్‌లో భాగం చేసుకుంటే.శరీరంలో రక్తం పెరగడంతో పాటు ఎముకలు దృఢంగా మారుతాయి. ఇందులో ఉండే పోషక పదార్థాల కారణంగా ఎన్నో రకాల అనారోగ్య సమస్యలు దూరమవుతాయి.

ఇవి ప్రయోజనాలు..
1. ఆధునిక జీవనశైలిలో చెడు ఆహారపు అలవాట్ల కారణంగా శరీరంలో ఐరన్ లోపం సంభవిస్తోంది. బ్లాక్ కిస్మిస్ తినడంతో శరీరంలో రక్తం వేగంగా ఏర్పడుతుంది. ఎముకలకు ప్రయోజనం చేకూరుతుంది. ఆస్టియోపోరోసిస్ బాధపడేవారికి
బ్లాక్‌ కిస్మిస్ చాలా మంచిది.

2. చలికాలం వస్తే చాలు శరీరంలోని రోగ నిరోధక శక్తి పడిపోతుంది. ఇమ్యూనిటీ క్షీణించడం వల్ల అంటు రోగాలు లేదా ఇన్ఫెక్షన్లు సోకుతాయి. వివిధ రకాల వ్యాధుల ముప్పు ఎక్కువవుతుంది. బ్లాక్ కిస్మిస్ తినడం వల్ల రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. అధిక రక్తపోటు సమస్యను తగ్గిస్తుంది. శరీరంలో కొలెస్ట్రాల్ స్థాయిని సైతం తగ్గిస్తోంది.

3. ప్రతి రోజు ఉదయం 7-8 కిస్మిస్‌లు తింటే జీర్ణక్రియ మెరుగు పడి మలబద్దకం సమస్య తొలగిపోతుంది. దీర్ఘకాలంగా మలబద్ధకంతో బాధపడుతుంటే ఇతర సమస్యలు చుట్టుముడతాయి. బ్లాక్ కిస్మిస్‌లో ఉండే ఫైటర్ కారణంగా
మలబద్ధకం నుంచి త్వరితగతిన విముక్తి పొందుతారు.

Related Articles

ట్రేండింగ్

Ys Bharathi Reddy: పాస్ పుస్తకాలపై జగన్ ఫోటో ఎందుకు.. రైతుల ప్రశ్నలకు సమాధానం చెబుతారా?

Ys Bharathi Reddy: ఎన్నికల సమయంలో రాజకీయ నేతల ప్రచారం జోరుగా సాగుతోంది. సమయం దగ్గర పడటంతో వారికి మద్దతుగా వారి కుటుంబ సభ్యులకు కూడా ప్రచారాన్ని ప్రారంభించారు. మొన్నటికి మొన్న పవన్...
- Advertisement -
- Advertisement -