Chiranjeevi: కథల ఎంపికలో మెగాస్టార్ తప్పు చేస్తున్నారా?

Chiranjeevi: సినీ ఇండస్ట్రీలో అప్పుడప్పుడు మనం ఊహించని సంఘటనలు చోటు చేసుకుంటుంటాయి. ఓ హీరో వద్దన్న కథతో మరో హీరోతో సినిమా చేయడం. ఒక హీరోయిన్ స్థానంలో మరో హీరోయిన్‌ను తీసుకోవడం వంటి ఘటనలు నమోదవుతుంటాయి. అయితే అలాంటి సినిమాలు హిట్ కావొచ్చు? లేదా ప్లాప్ అవ్వొచ్చు?. ఒక వేళ సినిమా హిట్ అయితే మాత్రం.. సినిమా వదులుకున్న హీరోపై అనవసరంగా మూవీ వదిలేశావనే పుకార్లు.. సినిమా ప్లాప్ అయి ఉంటే బాగానే ముందు జాగ్రత్త పడ్డావనే సలహాలు వినిపిస్తూ ఉంటాయి. అలా కొందరు హీరో రిజెక్ట్ చేసిన కథకు వేరే హీరోలు చేసి స్టార్లుగా మారిన వాళ్లు ఎంతో మంది ఉన్నారు. బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన సినిమాలు లెక్కలేనన్ని ఉన్నాయి. ఈ బాటలోనే ఇప్పుడు మెగాస్టార్ చిరంజీవి కూడా ఉన్నట్లు తెలుస్తోంది. సినీ రంగంలో సెకండ్ ఇన్సింగ్ ప్రారంభించిన చిరంజీవి వరుస సినిమాలతో ఫుల్ బిజీగా ఉంటున్నారు. స్టార్ హీరోలు ఏడాదికి ఒక్క సినిమా మాత్రమే తీస్తే.. చిరంజీవి మాత్రం ఏడాదికి రెండు, మూడు సినిమాలు ఓకే చేస్తున్నారు. రీసెంట్‌గా విడుదలైన ‘గాడ్ ఫాదర్’ సినిమా హిట్ టాక్‌ను అందుకుంది. డిఫరెంట్ లుక్‌తో ప్రేక్షకులను ఎంతగానో అలరించారు. చాలా మంది తన వయసుకు తగిన సినిమా చేశారని అభిప్రాయం వ్యక్తం చేశారు.

 

 

అయితే తాజాగా ఓ పుకారు వైరల్ అవుతోంది. గాడ్ ఫాదర్ సినిమా తర్వాత చిరంజీవి నటిస్తున్న సినిమా ‘వాల్తేరు వీరయ్య’. బాబీ దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కబోతుంది. అయితే ఈ సినిమాను ఫస్ట్ హీరోగా మహేశ్ బాబును అనుకున్నాడట డైరెక్టర్. రెండేళ్ల క్రితం స్టోరీ కూడా వినిపించాడట. కానీ స్టోరీ విన్న మహేశ్ బాబు సినిమాను రిజెక్ట్ చేశాడనే వార్తలు వినినిపిస్తున్నాయి. సినిమా స్టోరీ నచ్చకపోవడంతో మహేశ్ బాబు స్టోరీని రిజెక్ట్ చేశాడు. దీంతో డైరెక్టర్ బాబీ కథలో కొన్ని మార్పులు చేసి.. చిరంజీవికి వినిపించాడు. అయితే చిరంజీవికి స్టోరీ నచ్చింది. దీంతో శరవేగంగా షూటింగ్ స్టార్ట్ చేశారు. వచ్చే సంక్రాంతికి ‘వాల్తేరు వీరయ్య’ను థియేటర్లలో రిలీజ్ చేసేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -