Vijay Devarakonda: బన్నీకి విజయ్ దేవరకొండకు మధ్య ఉన్న లింక్ తెలుసా?

Vijay Devarakonda: యంగ్ సెన్సేషన్ విజయ్ దేవరకొండ గురించి పెద్దగా పరిచయం అవసరం లేదు. ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండా తనకంటూ ఇండస్ట్రీలో ఒక స్థానం ఏర్పరుచుకున్నారు. అర్జున్ రెడ్డి తరువాత విజయ్ దేవరకొండ కి వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అవసరం లేకుండా పోయింది. ఈ మధ్య కాలంలో చెప్పుకోతగ్గ విజయం లేకపోయినా విజయ్ దేవరకొండ ఎక్కడా తగ్గట్లేదు. లైగర్‌ చిత్రంతో విజయ్ దేవరకొండ పాన్ ఇండియా హీరోగా కూడా ఎదిగారు.

 

రౌడీ అని ఫ్యాన్స్ ముద్దుగా పిలుచుకునే విజయ్ దేవరకొండ కి అల్లువారబ్బాయి అర్జున్ కి ఒక లింక్ ఉంది..
ఆ లింక్ ఏంటంటే,విజయ్ దేవరకొండ కెరీర్ లో అర్జున్ రెడ్డి తరువాత అతిపెద్ద హిట్ గీతగోవిందం. అది అసలు అల్లు అర్జున్ చేయాల్సిన చిత్రం అట. ఏవో కారణాల వల్ల అల్లు అర్జున్ చేయలేకపోయారట. గీతగోవిందం కి సరైన హీరో కోసం వెతుకుతూ ఉంటే విజయ్ దర్శకుడి దృష్టిలో పడ్డారట. అన్నీ త్వరత్వరగా కుదరడం,సినిమా పట్టాలు ఎక్కడం వెంటనే జరిగిపోయాయి.

 

అల్లు అర్జున్ చేయాల్సిన చిత్రం చేయలేకపోయడం,ఆ చిత్రం విజయ్ దేవరకొండ చేతిలో పడటం అల్లు అర్జున్ పరోక్షంగా విజయ్ దేవరకొండ కి చేసిన హెల్ప్ అని అంటున్నారు. ఇన్ డైరెక్ట్ గా అల్లు అర్జున్ విజయ్ దేవరకొండ ని స్టార్ చేసారని నెట్టింట పెద్ద చర్చ నడుస్తుంది. గీతగోవిందం చిత్రం ఎంత పెద్ద హిట్ అయ్యిందో అందరికీ తెలిసిందే. విజయ్ దేవరకొండ ని స్టార్ చేయడానికి గీతగోవిందం ఎంతగా ఉపయోగపడిందో పెద్దగా చెప్పాల్సిన అవసరం లేదు.

 

గీతగోవిందం విజయదేవరకొండ,రష్మిక మందన్నా హీరో హీరోయిన్ లుగా తెరకెక్కిన చిత్రం. దర్శకుడు పరుశురామ్ ఒక మంచి ఎంటర్‌టైనింగ్ చిత్రం తీశారు.

Related Articles

ట్రేండింగ్

Nara Lokesh-Murugudu Lavanya: మంగళగిరిలో సీన్ సితారే.. లోకేశ్ దెబ్బకు వైసీపీ లావణ్య సైలెంట్ అయ్యారా?

Nara Lokesh-Murugudu Lavanya: 2019 ఎన్నికలలో నారా లోకేష్ వైసీపీ నేత ఆళ్ళ రామకృష్ణారెడ్డి చేతిలో మంగళగిరి అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పోటీ చేసి చాలా తక్కువ ఓట్లు తేడాతో ఓడిపోయారు. అయితే...
- Advertisement -
- Advertisement -