Chandrababu: పులివెందులపై ఫోకస్ పెట్టిన చంద్రబాబు.. జగన్‌ను ఓడించేలా ప్లాన్..

Chandrababu: వచ్చే ఎన్నికలకు పార్టీలన్నీ ఇప్పటినుంచే కసరత్తు చేస్తోన్నాయి. గెలుపు కోసం ఇప్పటినుంచే సన్నద్దమవుతోన్నాయి. నియోజకవర్గాల వారీగా సమీక్షలు నిర్వహిస్తూ పార్టీ నేతలను ఎన్నికలకు సిద్దం చేస్తోన్నారు. పలువురి నేతలకు ఇప్పటినుంచే టికెట్లను ఫిక్స్ చేస్తోన్నారు. మాజీ సీఎం, టీడీపీ అధినేత చంద్రబాబు సొంత నియోజకవర్గమైన కుప్పంను జగన్ టార్గెట్ చేశారు. అక్కడ చంద్రబాబుు ఓడించేందుకు ఎన్నికలకు ఏడాదిన్నర ముందు నుంచే వ్యూహలు పన్నుతోన్నారు. అక్కడ వైసీపీ ఇంచార్జ్‌గా ఉన్న భరత్ కు ఎమ్మెల్సీ పదవి ఇచ్చిన జగన్.. వచ్చే ఎన్నికల్లో భరత్‌ని గెలిపిస్తే మంత్రి పదవి ఇస్తానంటూ హామీ ఇచ్చారు.

 

కుప్పంలో జరిగిన పంచాయతీ, మున్సిపల్ ఎన్నికల్లో గెలిచిన వైసీపీ.. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో చంద్రబాబును ఓడించేందుకు ప్రయత్నాలు చేశారు. మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కుప్పంపై ప్రత్యేక దృష్టి పెట్టి వైసీపీ నేతలను యాక్టివ్ చేస్తోన్నారు. ఈ క్రమంలో పులివెందుల నియోజవకర్గంపై చంద్రబాబు ఫోకస్ పెట్టారు. తాజాగా పులివెందుల నియోజకవర్గంపై చంద్రబాబు సమీక్ష నిర్వహించారు. పులివెందులలో జగన్ ఓడించేలా చంద్రబాబు కసరత్తులు చేస్తోన్నారు.

 

 

జగన్ సొంత బాబాయి వివేకానందరెడ్డి హత్యపై జగన్ ప్రభుత్వంలో ఉండి కూడా ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదనే విమర్శలు సొంత నియోజకవర్గంలో ఉన్నాయి. అందుకే వివేకానందరెడ్డి హత్య కేసులో జగన్ పై ఉన్న విమర్శలను అస్త్రంగా మలుచుకుని పులివెందులలో జగన్ కు చెక్ పెట్టాలని చంద్రబాబు చూస్తున్నారు. వివేకానందరెడ్డి హత్యకు సంబంధించి పులివెందుల నియోజకవర్గంపై జగన్ పై వ్యతిరేకత పెరుగుతోంది. వైఎస్ అవినాష్ రెడ్డినే హత్యకు కారణమని వైఎస్సార్ టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ఢిల్లీ వెళ్లి స్వయంగా సీబీఐకి స్టేట్ మెంట్ ఇవ్వడం సంచలనంగా మారింది. తన తండ్రి వివేకానందరెడ్డి హత్య కేసులపై ఆమె కూతురు సుునీత పోరాటం చేస్తోంది, అయినా జగన్ ఆమెకు ఎలాంటి సహయం చేయడం లేదు. వీటన్నింటిని ఉపయోగించుకోవాలని టీడీపీ చూస్తోంది.

Related Articles

ట్రేండింగ్

AP Roads: ఏపీలో రోడ్ల పరిస్థితిని చూపించి ఓట్లు అడిగే దమ్ముందా.. వైసీపీ నేతల దగ్గర జవాబులున్నాయా?

AP Roads:  ఒక రాష్ట్రం అభివృద్ధి బాటలో నడవాలి అంటే ముందుగా ఆ రాష్ట్రంలో మౌలిక సదుపాయాలన్నీ కూడా సక్రమంగా ఉండాలి మౌలిక సదుపాయాలు అంటే రోడ్లు కరెంట్ నీరు వంటి వాటివి...
- Advertisement -
- Advertisement -