Prabhas: ప్రభాస్ ఫ్యాన్స్ కు శుభవార్త.. పూనకాలే అంటూ?

Prabhas: బహుబలి సినిమా తర్వాత యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ రూటే మారిపోయింది. ప్రపంచవ్యాప్తంగా అభిమానాన్ని సంపాదించుకుని గ్లోబర్ స్టార్‌గా ఎదిగాడు. ఇటీవల నిర్వహించిన ఓ సర్వేలోనూ టాలీవుడ్‌లో అత్యధికంగా క్రేజ్ ఉన్న హీరోల్లో ప్రభాస్ టాప్ పొజిషన్‌లో ఉన్నాడు. ప్రస్తుతం ప్రభాస్ వరుసపెట్టి సినిమాలు చేస్తున్నారు. కేజీఎఫ్ ఫేమ్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ప్రభాస్ ‘సలార్’ సినిమాలో నటిస్తున్న విషయం తెలిసిందే. అయితే ఈ సినిమా షూటింగ్ పూర్తికాకముందే.. ప్రభాస్ మరో మూవీలో కూడా యాక్ట్ చేస్తున్నాడు. యంగ్ డైరెక్టర్ నాగ్ అశ్విన్ దర్శకత్వంలో ‘ప్రాజెక్ట్ కే’ సినిమాలో నటిస్తున్నారు. ఈ రెండు సినిమాల్లోనే కాకుండా ప్రభాస్ డైరెక్టర్ మారుతితో కలిసి ఓ సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాలో ప్రభాస్ దెయ్యం క్యారెక్టర్‌లో నటించబోతున్నట్లు ప్రచారం జరుగుతోంది.

 

అయితే ఇప్పటికే ‘సలార్’ సినిమాపై మంచి హైప్ క్రియేట్ అయింది. అభిమానులతోపాటు ప్రేక్షకులు ఎంతోగానో ఆతురతగా ఎదురు చూస్తున్నారు. ప్రాజెక్ట్ కే, సలార్ సినిమాలు మంచి హిట్ కొడతాయని సినీ వర్గాలు భావిస్తున్నాయి. దీనికి ముఖ్య కారణం ఇప్పటికే విడుదలైన ప్రభాస్ లుక్. రాధేశ్యామ్, సాహో సినిమాల్లో నటించేటప్పుడు ప్రభాస్ లుక్ పరంగా మ్యాచో లుక్ మిస్ అయింది. ఆ లుక్స్ ఆడియన్స్ ను కూడా ఆకట్టుకోలేకపోయాయి. లుక్ పరంగా ఎదో మిస్ అయిందని తెగ బాధపడ్డారు. కానీ సలార్ వర్కింగ్ స్టిల్స్ లోనే ఆ లుక్ తిరిగి కనిపిస్తోందని అంటున్నారు. ఆ లుక్‌ను చూసిన ప్రభాస్ అభిమానులు కూడా సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

 

డైరెక్టర్ ప్రశాంత్ నీల్ కూడా మాస్ పల్స్ తెలిసిన దర్శకుడు. కేజీఎఫ్‌లో హీరో యష్ లుక్‌ని ఎంతో డిఫరెంట్‌లో చూయించాడు. ప్రభాస్ లాంటి గ్లోబల్ స్టార్‌ను సినిమాలో ఎలా చూపిస్తే ప్రేక్షకులకు నచ్చుతారో అలానే ప్లాన్ చేశారు. సలార్‌లో కూడా ప్రభాస్ లుక్ అదిరిపోయింది. రఫ్ లుక్, గుబురైన గడ్డం, ఒంటిపై చెమటలు, అదిరిపోయే ఫిజిక్‌తో అలరించాడు. ఈ స్టిల్ చూసి సలార్ సినిమాపై అంచనాలు మరింతగా పెరిగాయి. సినిమా రిలీజ్ కోసం అభిమానులు ఎంతో ఎక్సైట్‌మెంట్‌తో ఎదురు చూస్తున్నారు. కాగా, ఈ సినిమాలో హీరోయిన్‌గా శృతిహాసన్ నటిస్తోంది.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -