Liquor Scam: ఢిల్లీ లిక్కర్ స్కాంలో జగన్, విజయసాయిరెడ్డి?

Liquor Scam: ఢిల్లీ లిక్కర్ స్కాం ఏపీలోనూ సంచలనం సృష్టిస్తోంది. ఈ కేసులో సీఎం జగన్ నమ్మినబంటు అయిన విజయసాయిరెడ్డి అల్లుడు, అరబిందో ఫార్మాలో డైరెక్టర్ గా ఉన్న శరత్ చంద్రారెడ్డి చిక్కుకోవడం కలకలం రేపుతోంది. ఢిల్లీ లిక్కర్ స్కాంలో శరత్ చంద్రారెడ్డిని ఈడీ అరెస్ట్ చేసింది. దీంతో అరబిందో ఫార్మా షేర్లు ఒక్కసారిగా పడిపోయాయి. విజయసాయిరెడ్డి అల్లుడు చిక్కుకోవడంతో ప్రతిపక్షాలు విమర్శలు చేస్తోన్నాయి.

 

ఈ క్రమంలో టీడీపీ మాజీ ఎమ్మెల్యే బొండా ఉమామహేశ్వరరావు సంచలన వ్యాఖ్యలు చేశారు. ఢిల్లీ లిక్కర్ స్కాంలో సీఎం జగన్, విజయసాయిరెడ్డి కూడా ఉన్నారని బొండా ఉమా సంచలన వ్యాఖ్యలు చేశారు. తాజాగా మీడియాతో మాట్లాడిన ఆయన.. శరత్ చంద్రారెడ్డిని బినామీగా పెట్టుకుని విజయసాయిరెడ్డి లిక్కర్ వ్యాపారం చేస్తున్నారని ఆరోపించారు. శరత్ చంద్రారెడ్డిని విజయసాయిరెడ్డి బలిపశువు చేశారని ఆరోపించారు.

 

జగన్, విజయసాయిరెడ్డిలను నమ్ముకున్న వాళ్లందరూ జైలుకెళ్లడం ఖాయమని బొండా ఉమా ఆరోపించారు. అరబిందో ఫార్మా కుటుంబీకులకు లిక్కర్ వ్యాపారాలు ఎక్కడా లేవని, విజయసాయిరెడ్డి నడిపిస్తున్నారంటూ ఆరోపించారు. ఏపీలో అదాన్ డిస్టిలరీస్ పేరుతో కల్తీ లిక్కర్ వ్యాపారం జరుగుతోందని తెలిపారు.

 

2019లో తెచ్చిన కొత్త మద్యం పాలసీ ప్రకారం రూ.4 లక్షల కోట్ల మద్యం వ్యాపారం జరిగిందని తెలిపారు. ఈ డబ్బు మొత్తం ఎక్కడికి పోయిందో జగన్, విజయసాయిరెడ్డి చెప్పాలని డిమాండ్ చేశారు. శరత్ చంద్రారెడ్డి అరెస్ట్ కావడంతో.. ఈ కేసులో ఇంకెంతమంది అరెస్ట్ అవుతారో అనే చర్చ జరుగుతోంది. ఇప్పటికే పలువురు వైసీపీ ఎంపీల పేర్లు ఈ కేసులో వినిపించిన విషయం తెలిసిందే. ఒంగోలు వైసీపీ ఎంపీ పేరు లిక్కర్ స్కాం కేసులో వినిపించింది. దీంతో తనకు లిక్కర్ స్కాంతో సంబంధం లేదని, తన బంధువులకు కంపెనీల ఉన్నాయిన ఆయన తెలిపారు. దీంతో రానున్న రోజుల్లో ఏం జరుగుతుందనేది చూడాలి.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -