NagaBabu: మెగా ఫ్యామిలీ వల్ల నాగబాబు నిండా మునిగిపోయారా?

NagaBabu: టాలీవుడ్ ఫిల్మ్ ఇండస్ట్రీని ఏలుతున్న వారిలో మెగా ఫ్యామిలీ ఒకటి. మెగాస్టార్ చిరంజీవి, పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్ ఇండస్ట్రీకి రెండు కళ్లలాంటి వారు. ఫ్యాన్ ఫాలొయింగ్‌లో ఒకరికి మించి మరొకరు పైచేయి సాధించారు. తమకంటూ ప్రత్యేక గుర్తింపు, స్టార్ ఇమేజ్‌ను సంపాదించుకున్నారు. అయితే సినీ ఇండస్ట్రీలో మెగాస్టార్ చిరంజీవి ఒంటరిగా ఎంట్రీ ఇచ్చాడు. తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న తర్వాత.. చిరు తమ్ముడు పవన్ కళ్యాణ్ ఎంట్రీ ఇచ్చాడు. అప్పట్లో తమ్ముడు, ఖుషీ సినిమాలు సంచలన రికార్డులు సృష్టించాయి. దాంతో ఒకేసారి స్టార్ హోదాను సెట్ చేసుకున్నాడు. ఖుషీ సినిమా తర్వాత పవన్ కళ్యాణ్ గుడుంబా శంకర్ సినిమా చేశాడు.

 

 

డైరెక్టర్ వీర శంకర్ దర్శకత్వంలో ఈ సినిమాను తెరకెక్కించారు. అయితే అప్పటికే నాగబాబు ‘కౌరవుడు’ సినిమా తీశాడు. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టడంతో.. నాగబాబు అప్పుల్లో కూరుకుపోయాడు. దాంతో పవన్ కళ్యాణ్‌.. నాగబాబును ఆదుకోవాలని అనుకున్నాడు. ఈ క్రమంలో గుడుంబా శంకర్ సినిమాకు నిర్మాతగా నాగబాబుకు ఛాన్స్ ఇచ్చాడు. అయితే ఈ సినిమా థియేటర్లలో విడుదలై.. మొదటిరోజు భారీ కలెక్షన్లు సాధించింది. అయితే సినిమాపై నెగిటివ్ టాక్ రావడంతో థియేటర్లకు రావడానికి ప్రేక్షకులు ఆసక్తి చూపలేదు. దాంతో వసూళ్లు రాబట్టలేకపోయింది. కానీ అదృష్టమేంటంటే.. అప్పుడు థియేటర్లలో పెద్ద సినిమాలు కూడా లేవు. గుడుంబా శంకర్ సినిమానే థియేటర్లలో నెట్టుకుంటూ వచ్చారు. అయితే ఐదు వారాల తర్వాత చిరంజీవి నటించిన ‘శంకర్ దాదా ఎంబీబీఎస్’ సినిమా థియేటర్లలో విడుదలైంది. ఈ సినిమా భారీ స్థాయిలో కలెక్షన్లు రాబట్టింది. ప్రేక్షకులు శంకర్ దాదా సినిమా చూసేందుకు ఆసక్తి చూపడంతో.. గుడుంబా శంకర్ ఢీలా పడింది. చాలా వరకు థియేటర్లలో గుడుంబా శంకర్ సినిమాను తీసేసి.. చిరంజీవి సినిమాను ఆడించారు. ఓవర్‌ ఆల్‌గా గుడుంబా శంకర్ సినిమా రూ.13 కోట్లు రాబట్టింది. అయితే శంకర్ దాదా ఎంబీబీఎస్ సినిమాను ఆ సమయంలో విడుదల చేసి ఉండకపోతే.. గుడుంబా శంకర్ సినిమా మరిన్నీ కలెక్షన్లు రాబట్టేదని సినీ వర్గాలు తెలిపారు. నిర్మాత నాగబాబు కూడా అప్పుల నుంచి గట్టెక్కేవాడని చెప్పుకొచ్చారు. కొంతమేరా నాగబాబు అప్పుల నుంచి బయటపడినా.. ఇద్దరు తమ్ముళ్లు తెలియకుండానే నాగబాబుకు అన్యాయం చేశారని సినీ వర్గాలు తెలిపాయి.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -