Bedroom: ఈ వాస్తు ప్రకారం పడక గది ఉంటే ఆ దంపతుల జీవితం సుఖంగా ఉంటుంది!

Bedroom: అప్పుడప్పుడు భార్యాభర్తల మధ్య జరిగే గొడవలు ఎక్కడికో దారి తీస్తాయి. ఎలాంటి కారణాలు లేకున్నా గొడవలు జరుగుతుంటాయి.  పెద్దలు సర్ది చెప్పినా కొన్ని రోజుల వరకు బాగానే ఉన్నా.. మళ్లీ పరిస్థితి మొదటికి వస్తోంది. ఎలా ఎందుకు జరుగుతుందోనని తెలియక చాలా మంది దంపతులు ఇబ్బందులు పడుతుంటారు. అయితే ఇలా జరగడానికి వాస్తులు కూడా కారణమవుతాయని జ్యోతిష్యులు చెబుతుంటారు.  భాగస్వామితో సంతోషకరమైన సంబంధం, అవగాహన, అనుకూలత, బంధాన్ని కలిగి ఉండటానికి మీ పడకగది, వంటగది సహా మొత్తం ఇంట్లో శక్తి సమతుల్యతను కలిగి ఉండటం చాలా ముఖ్యమని వాస్తు నిపుణులు చెబుతున్నారు.

వాస్తు ప్రకారం భార్యభర్తల బెడ్రూమ్‌ ఆగ్నేయ దిశలో ఉండకూడదట. ఆగ్నేయం అగ్నిదేవుడి నివాసం ఇది శాంతికి ఆటంకం కలిగిస్తుంది. అంతేకాక ఇరువురిని కోపోద్రిక్తులను చేసేందుకు దారి తీస్తోంది. ఆగ్నేయ దిశలో భాగస్వామితో సంభాషణ చేయవద్దు. ఇలా చేయడం వల్ల మీ భాగస్వామితో తగాదాలు, అనవసర వాదనలు పెరుగుతాయి. ఉత్తర వాయువ్య దిశలో ఉన్నప్పుడు భాగస్వామితో శృంగార సంభాషణ చేయాలి. కొత్తగా పెళ్లయిన జంట పడకగది ఉత్తర వాయువ్య దిశలో ఉండాలి. ఇంటిలో పెద్దవారి పడకగది దక్షిణ దిశలో ఉండాలి.

ఒకే వరుసలో డిప్‌– వాపింగ్‌ సింక్, గ్యాస్‌ స్టవ్‌ ఉండకూడదు. నీరు, అగ్ని ఎల్లప్పుడూ వేరు వేరుగా ఉండాలి. పడక గదిని చక్కగా, శుభ్రంగా ఉండేలా చూసుకోండి. మీ పడక గదిలో, చెత్త లేదా పెరిగిన వస్తువులను ఉండకూడదు. సుఖ సంతోషకరమైన సంబంధం కోసం మీ పడకగదిని పువ్వులు, కొవ్వొత్తులు, సువాసనలతో అలంరించుకోవాలి. ఇలా బెడ్రూమ్‌ను ఉంచుకుంటే   ఆ దంపతులు జీవితంలో ఎలాంటి వివాదాలు చోటు చేసుకోవని వాస్తు నిపుణులు సూచిస్తున్నారు.

Related Articles

ట్రేండింగ్

Andhra Pradesh Assembly Elections: గులకరాళ్లతో, పసుపు చీరలతో రాజకీయాలు.. ఏపీ పరిస్థితి ఇంత దారుణంగా ఉందా?

Andhra Pradesh Assembly Elections: మరొక రెండు వారాలలో ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలతో పాటు పార్లమెంట్ ఎన్నికలు కూడా జరగబోతున్నటువంటి నేపథ్యంలో రాజకీయ వేడి రాజుకుంది. ఈ విధంగా ఎన్నికల త్వరలో జరగబోతున్నటువంటి...
- Advertisement -
- Advertisement -