England: కంగారూల దాటికి ఖంగుతిన్న ప్రపంచ ఛాంపియన్లు.. ఇంగ్లాండ్‌కు ఘోర అవమానం..

England: ఇటీవలే ఆస్ట్రేలియా వేదికగా ముగిసిన టీ20 ప్రపంచకప్ లో ఇంగ్లాండ్ క్రికెట్ జట్టు ఫైనల్ లో పాకిస్తాన్ ను ఓడించి రెండోసారి టైటిల్ నెగ్గింది. అయితే ఇది జరిగి రెండు వారాలు కూడా గడవకముందే ఆ జట్టుకు ఆస్ట్రేలియా భారీ షాకిచ్చింది. టీ20 వరల్డ్ కప్ తర్వాత వారానికే ఆస్ట్రేలియాతో వన్డే సిరీస్ ఆడిన ఇంగ్లాండ్.. మూడు వన్డేలలో ఒక్కటైనా గెలవలేదు. మూడింటికి మూడూ కంగారూలే సొంతం చేసుకుని ఇంగ్లాండ్ కు కోలుకోలేని షాకిచ్చారు.

నవంబర్ 13న మెల్‌బోర్న్ వేదికగా ఇంగ్లాండ్ – పాకిస్తాన్ ఫైనల్ జరగగా ఈ మ్యాచ్ లో అన్ని విభాగాలలో రాణించిన ఇంగ్లీష్ క్రికెట్ జట్టు పాకిస్తాన్ ను చిత్తు చేసింది. వరల్డ్ కప్ విన్నర్స్ నాలుగు రోజుల (నవంబర్ 17) తర్వాత ఆస్ట్రేలియాతో మూడు మ్యాచ్ ల వన్డే సిరీస్ ఆడారు.

తొలి వన్డేలో ఆస్ట్రేలియా చేతిలో పరాజయం.. మళ్లీ రెండ్రోజులకు రెండో వన్డేలోనూ అదే ఫలితంతో సిరీస్ పోయింది. సరే రెండు వన్డేలు పోయినా కనీసం మూడో వన్డేలో అయినా గెలిచి పరువు దక్కించుకుంటారని భావించినా మంగళవారం ముగిసిన మూడో వన్డేలో కూడా ఇంగ్లాండ్ చిత్తుచిత్తుగా ఓడింది. దీంతో సిరీస్ 3-0తో ఆసీస్ వశమైంది. మూడో వన్డేలో ఆసీస్ ఓపెనర్లు ట్రావిస్ హెడ్ (152), డేవిడ్ వార్నర్ (106) లు సెంచరీలతో కదం తొక్కారు. ఫలితంగా ఆసీస్.. 48 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 355 పరుగులు చేసింది. భారీ లక్ష్య ఛేదనలో ఇంగ్లాండ్.. 31.4 ఓవర్లలో 142 పరుగులకే ఆలౌట్ అయింది. డక్ వర్త్ లూయిస్ పద్ధతి ప్రకారం ఆస్ట్రేలియా.. 221 పరుగుల తేడాతో విజయం సాధించింది.

టీ20 ప్రపంచకప్ కు ముందు ఆస్ట్రేలియాతో జరిగిన మూడు మ్యాచ్ ల టీ20 సిరీస్ ను ఇంగ్లాండ్ 2-0తో దక్కించుకుంది. దానికి ఇప్పుడు కంగారూలు బదులు తీర్చుకున్నారు.

 

Related Articles

ట్రేండింగ్

AP Roads: ఏపీలో రోడ్ల పరిస్థితిని చూపించి ఓట్లు అడిగే దమ్ముందా.. వైసీపీ నేతల దగ్గర జవాబులున్నాయా?

AP Roads:  ఒక రాష్ట్రం అభివృద్ధి బాటలో నడవాలి అంటే ముందుగా ఆ రాష్ట్రంలో మౌలిక సదుపాయాలన్నీ కూడా సక్రమంగా ఉండాలి మౌలిక సదుపాయాలు అంటే రోడ్లు కరెంట్ నీరు వంటి వాటివి...
- Advertisement -
- Advertisement -