Child Artist Shriya Sharma: వామ్మో.. మెగాస్టార్ మేనకోడలు ఇంతలా మారిపోయిందా?

Child Artist Shriya Sharma: ‘జై చిరంజీవా’ సినిమాలో చిన్నారి చిచ్చరపిడుగు గుర్తుందా? అదేనండీ చిరంజీవి మేనకోడలుగా అల్లరి చేసిన బాలిక. ఆమె పేరు శ్రీయా శర్మ. ఆ సినిమా కథాంశం ఆమె చుట్టూనే తిరుగుతుంది. తెరపై కనిపించేది కాసేపైనా, సినిమా రిజల్ట్ తో సంబంధం లేకుండా.. ఎమోషనల్‌గా అందరినీ వెంటాడుతుంది ఆమె క్యారెక్టర్.

ఆ తర్వాత ఆమె రజనీకాంత్ ‘రోబో’ లో క్లైమాక్స్‌లో వచ్చే మ్యూజియమ్ సీన్‌లో కనిపిస్తుంది. రచ్చ, ఎటో వెళ్లిపోయింది మనసు, తూనీగ తూనీగ, దూకుడు చిత్రంలో సమంత చెల్లెలిగా నటించింది.

హీరోయిన్‌గా దక్కని లక్

ఇలా టీనేజ్ అమ్మాయి పాత్రలు చేస్తున్న సమయంలో హీరోయిన్‌గా చేసే అవకాశం వచ్చింది. బిగ్ బాస్ తో ఫేమస్ అయినా అలిరాజా హీరోగా తెరకెక్కిన ‘గాయకుడు’ సినిమాలో శ్రియ శర్మ హీరోయిన్ గా చేసింది.ఆ సినిమా అనుకున్నంత విజయం సాధించలేకపోయిందనే చెప్పాలి. ఆ తర్వాత హీరో శ్రీకాంత్ కుమారుడు రోషన్ కు జోడిగా నిర్మల కాన్వెంట్ అనే చిత్రంలోనూ నటించింది. ఈ మూవీ ఫర్వాలేదనిపించింది. అయితే హీరోయిన్‌గా అదృష్టం కలిసిరాలేదు.

ఆ తర్వాత తెలుగులో ఆమె మళ్లీ కనిపించడం మానేసింది. ‘కసౌటీ జిందగీ కే’ అనే సీరియల్ తోనూ మంచి పేరు తెచ్చుకుంది. కొన్ని వెబ్ సిరీస్‌లు చేసింది. ప్రస్తుతం మళ్లీ తెలుగు సినిమాల్లో బిజీ కావడానికి ఆమె ప్రయత్నిస్తోందని వార్తలు వస్తున్నాయి.

 

హిమాచల్ ప్రదేశ్‌కు చెందిన ఈ బొద్దు గుమ్మ ప్రస్తుతం 25 ఏట అడుగుపెట్టింది. తన ఫోటోలను సోషల్ మీడియాలో పోస్టు చేస్తూ అభిమానులకు టచ్‌లో ఉంటోంది. మరి ఆమెకు అవకాశాలు దక్కుతాయేమో చూడాలి మరి.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -