NTR: ఆ సినిమాను వదులుకుని ఎన్టీఆర్ తప్పు చేశారా?

NTR: టాలీవుడ్ స్టార్ హీరో యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఇమేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. నిన్ను చూడాలని సినిమాతో టాలీవుడ్‌కు పరిచయమై ఆది, సింహాద్రి, యమదొంగ సినిమాలతో అగ్రహీరోగా క్రేజ్ సంపాదించుకున్నాడు. ఇటీవల దర్శకుడు రాజమౌళి తెరకెక్కించిన ఆర్.ఆర్.ఆర్ సినిమాతో పాన్ ఇండియా, పాన్ వరల్డ్ హీరోగానూ పేరు తెచ్చుకున్నాడు. ప్రస్తుతం కొరటాల శివ దర్శకత్వంలో ఎన్టీఆర్ ఓ సినిమాలో నటిస్తున్నాడు. గత ఆరు సినిమాల నుంచి ఎన్టీఆర్ కెరీర్‌లో ఫ్లాప్ అనేది లేదు. టెంపర్ మూవీ నుంచి ఆర్.ఆర్.ఆర్ వరకు అన్ని సినిమాలు హిట్ అయ్యాయి.

 

ఇతర స్టార్ హీరోలతో పోలిస్తే ఎన్టీఆర్‌ను ఈ అంశం ప్రత్యేకంగా నిలబెడుతోంది. అయితే టెంపర్ సినిమా కంటే ముందు ఎన్టీఆర్ ఫ్లాపుల్లో ఉన్నాడు. శక్తి, ఊసరవెల్లి, రామయ్య వస్తావయ్యా, రభస ఇలా వరుసగా ఫ్లాపులు పలకరించాయి. మధ్యలో బృందావనం ఒక్కటే ఊరటనిచ్చే విజయాన్ని సాధించింది. అయితే ఆ సమయంలో ఎన్టీఆర్ తనకు తెలియకుండా ఓ పొరపాటు చేశాడని ఇటీవల ఫిలింనగర్‌లో టాక్ వినిపిస్తోంది.

 

అదేంటంటే.. సురేందర్‌రెడ్డి దర్శకత్వంలో రవితేజ నటించిన కిక్ సినిమా ఇండస్ట్రీ హిట్‌గా నిలిచింది. అయితే ముందుగా దర్శకుడు ఈ కథను తారక్‌ దగ్గరకు తీసుకువెళ్లాడట. ఎన్టీఆర్ సోదరుడు కళ్యాణ్‌రామ్‌తో సురేందర్‌రెడ్డి అతనొక్కడే సినిమాను తెరకెక్కించాడు. దీంతో ఎన్టీఆర్‌ను ఉద్దేశించి కిక్ సినిమా కథను సురేందర్‌రెడ్డి రాసుకున్నాడు. కానీ అప్పటికే వ‌రుస‌గా స్టార్ డైరెక్ట‌ర్ల‌తో సినిమాలు చేస్తున్నా వ‌రుస ప్లాపులు వ‌స్తుండ‌డంతో ఎందుకో ఎన్టీఆర్‌కు ఈ స్టోరీ క‌నెక్ట్ కాలేదు.

కిక్ ఎన్టీఆర్ చేసుంటే మరోలా ఉండేదా?

కిక్ కంటే ముందే సురేందర్‌రెడ్డితో ఎన్టీఆర్ అశోక్ అనే సినిమాలో నటించాడు. కానీ ఆ సినిమా ఆశించిన విజయాన్ని అందుకోలేదు. దీంతో కిక్ సినిమాను ఎన్టీఆర్ వదులుకున్నాడు. ఒకవేళ కిక్ సినిమా ఎన్టీఆర్ చేసి ఉంటే అతడి కెరీర్‌లో మరో బిగ్గెస్ట్ హిట్ పడి ఉండేదని నందమూరి అభిమానులు భావిస్తున్నారు. విచిత్రం ఏంటంటే ఎన్టీఆర్ తర్వాత కిక్ కథను ప్రభాస్‌కు వినిపించగా అతడు కూడా నో చెప్పడంతో చివరకు రవితేజ దగ్గరకు వెళ్లింది.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -