Kavitha-Sharmila: గులాబీ తోటలో “కవిత” లకు కొదువ లేదు.. షర్మిల సెటైర్స్ వైరల్!

Kavitha-Sharmila: ఒకప్పుడు రాజకీయాల్లో హుందాతనం ఉండేది. కానీ ఇప్పుడు రాజకీయాలు చేయాలంటే విమర్శలు, ప్రతి విమర్శలు చేయాల్సిందే. అసలు విమర్శలు లేకుండా రాజకీయాల్లోకి రావడం అనేది దాదాపు అసాధ్యంగానే మారింది. తెలుగు రాష్ట్రాల్లో రాజకీయాలు కూడా ఇదే కోవలో సాగుతున్నాయి. ఒకరు ఒక విమర్శ చేస్తే, దాని మీద మరొకరు పది విమర్శలు చేస్తున్నారు.

గత కొద్దిరోజులుగా తెలంగాణ మీద పూర్తిస్థాయి దృష్టిపెట్టిన వైయస్ షర్మిల.. తెలంగాణ వ్యాప్తంగా పాదయాత్ర చేసుకుంటూ ప్రజలతో మమేకమవుతున్న విషయం తెలిసిందే. పాదయాత్ర చేసుకుంటూ తెలంగాణ ప్రభుత్వం మీద మరీ ముఖ్యంగా కేసీఆర్ మీద షర్మిల తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పిస్తూ ఉంటుంది. అయితే నర్సంపేట ఎపిసోడ్ తర్వాత షర్మిల నేరుగా కేసీఆర్ ని టార్గెట్ చేస్తూ విమర్శలు గుప్పించారు.

అయితే కేసీఆర్ ని విమర్శించడం, తెలంగాణ ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టేందుకు వైయస్ షర్మిల ప్రయత్నిస్తుండటంతో కల్వకుంట్ల కవిత సోషల్ మీడియా వేదికగా స్పందించారు. ” తాము వదిలిన ‘బాణం’ తానా అంటే తందానా అంటున్న ‘తామర పువ్వులు’” అంటూ కవిత ట్విట్టర్ వేదికగా విమర్శనాస్త్రాన్ని సంధించారు.

దీంతో కల్వకుంట్ల కవితకు వైయస్ షర్మిల ఘాటుగా సమాధానమిచ్చింది. “పాదయాత్రలు చేసింది లేదు.. ప్రజల సమస్యలు చూసింది లేదు.. ఇచ్చిన హామీల అమలు లేదు.. పదవులే కానీ పనితనం లేని గులాబీ తోటలో ‘కవిత’లకు కొదవ లేదు” అంటూ షర్మిల ఘాటూగానే స్పందించారు. మొత్తానికి ఇద్దరు మహిళా నేతలు ఇలా దొందూ దొందే అన్నట్లు వ్యవహరించడం మీద అటు టీఆర్ఎస్, ఇటు షర్మిల పార్టీలోనూ చర్చ సాగుతోంది. తెలంగాణలో ఇప్పుడు పులివెందుల-తెలంగాణ వార్ నడుస్తోందని కొంతమంది నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -