Ram Charan: చిరంజీవి స్థాయిని పెంచిన చరణ్.. ఆయన గర్వించేలా?

Ram Charan: మెగాస్టార్ చిరంజీవి తన తనయుడు మెగా పవర్‌స్టార్ రామ్ చరణ్‌ను చూసి మురిసిపోతున్నారు. ఫ్యూచర్ ఆఫ్ యంగ్ ఇండియా కార్యక్రమంలో ట్రూ లెజెండ్‌గా రామ్ చరణ్‌ అవార్డు సొంతం చేసుకోవడం సంతోషకరంగా ఉందని, అతడిని చూసి ఎంతో గర్వంగా ఉందన్నారు. ఈ మేరకు సోషల్ మీడియాలో చరణ్‌తో దిగిన చిన్ననాటి ఫోటోలను చిరంజీవి షేర్ చేశారు. దీనికి ‘కంగ్రాట్స్ డియర్ చరణ్.. ఫ్యూచర్ ఆఫ్ యంగ్ ఇండియాలో ట్రూ లెజెండ్ అవార్డు అందుకోవడం సంతోషంగా ఉంది. నిన్ను చూసి ఎంతో గర్వంగా ఉంది. నువ్వు ఇలాగే ముందుకు సాగాలి.’ అని చెప్పుకొచ్చారు. ఈ పోస్టుపై స్పందించిన రామ్ చరణ్.. ‘లవ్ యూ నాన్న’ అని సమాధానం చెప్పాడు.

 

కాగా, వివిధ రంగాల్లో విశేషమైన సేవలు అందించే ప్రముఖులకు ఓ ఆంగ్ల పత్రికా సంస్థ ఫ్యూచర్ ఆఫ్ యంగ్ ఇండియా అవార్డును అందజేస్తుంది. ఈ క్రమంలో ఆదివారం అవార్డు కార్యక్రమం జరిగింది. ఎంటర్‌టైన్‌మెంట్ రంగంలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్‌కు ట్రూ లెజెండ్ అవార్డు దక్కింది. ఈ కార్యక్రమంలో రామ్ చరణ్ తన తండ్రి గురించి, ఆయన చేసిన సేవా కార్యక్రమాల గురించి మాట్లాడారు. అలాగే నటనలో ఆయన వారసత్వాన్ని కొనసాగిస్తున్నానని పేర్కొన్నారు. ఈ అవార్డును తన తండ్రి చిరంజీవికే అంకితం చేస్తున్నట్లు తెలిపారు.

 

ఆ ఒక్క సంఘటన..

‘1997లో మా కుటుంబానికి చెందిన ఓ వ్యక్తికి ఆపరేషన్ సమయంలో రక్తం దొరకక మరణించాడు. ఆ ఒక్క సంఘటన మమ్మల్నీ కలచివేసింది. ఆ బాధ నుంచి పుట్టుకొచ్చిందే.. ‘చిరంజీవి బ్లడ్ బ్యాంక్’. రక్తదానం చేయండి.. తనతో ఫోటో దిగే అవకాశాన్ని సొంతం చేసుకోండని మా నాన్న గారు అభిమానులకు పిలుపునిచ్చారు. నాన్న స్టార్ట్ చేసిన ఓ మంచి పని ఇప్పుడు ఎంతో ప్రాణాలను కాపాడుతోంది.’ అని రామ్ చరణ్ చెప్పుకొచ్చాడు. కాగా, ‘ఆర్ఆర్ఆర్’ సినిమా ఆస్కార్ బరితో దిగడం ఎంతో ఆనందంగా ఉందన్నారు. దర్శకధీరుడు రాజమౌళికి ఆ అవార్డు రావాలని తాను కోరుకుంటున్నట్లు చరణ్ తెలిపారు.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -