Madhya Pradesh: లక్ అంటే ఇదే.. రాత్రికి రాత్రి లక్షాధికారి అయిన గుమస్తా

Madhya Pradesh: దేనికైనా అదృష్టం కలిసి రావాలంటారు పెద్దలు. దేనికైనా రాసి పెట్టి ఉండాలని అంటారు. అదృష్టం ఎప్పుడు కలిసొస్తుందో ఎవరికే తెలియదంటారు. ఎప్పుడైనా ఎవరికైనా అదృష్టం కలిసి రావొచ్చు.. కొంచమైనా లక్ కలిసి రావాలి. అప్పుడే ఎవరైనా సక్సెస్ అవ్వుతారు. కొంతమందికి లాటరీలో జాక్ పాట్ తగిలి రాత్రికి రాత్రే కోటీశ్వరులు, లక్షాధికారులు అవుతారు. అదృష్టం కలిసి వచ్చి రాత్రికి రాత్రే వారి దశ మారిపోతూ ఉంటుంది. ఎప్పుడు ఎవరికైనా ఏదోక విషయాలు జాక్ పాట్ తగలవచ్చు.

ఇప్పుడు ఓ కూలీకి అలాగే అదృష్టం కలిసి వచ్చింది. రోడ్డుపై వెళుతుండగా జాక్ పాట్ కలిసి వచ్చింది. దీంతో రాత్రికి రాత్రే లక్షాధికారి అయిపోయింది. కూలీ పనులు చేసుకునే అతడు లక్ కలిసొచ్చి లక్షాధికారి అయిపోయాడు. అందుకే ఓడలు బండ్లు.. బండ్లు ఓడలు అయిపోతాయంటారు. కోటీశ్వరులు ఒక్కసారిగా పడిపోవచ్చు.. సాధారణ మనిషి ఒక్కసారిగా కోటీశ్వరుడు అవ్వవొచ్చు. ఆ సామెత ఈ కూలీకి కరెక్ట్ గా సరిపోతుందని చెప్పవచ్చు.

మధ్యప్రదేశ్ కు లోని పన్నా జిల్లాలోని రాణింగజ్ కు చెందిన నందిలాల్ రాజక్ అనే వ్యక్తి పేదవాడు. పొట్టకూటి కోసం బల్దేవ్ చౌక్ లో ని ఒక కిరానా కొట్టులో గుమస్తాగా పనిచేస్తున్నాడు. నెల జీతానికి ఆ షాపులో పనిచేస్తున్నాడు. అయితే ఒకరోజు డ్యూటీ ముగించుకుని షాపు నుంచి ఇంటికి వెళ్తూ రోడ్డుపై నడుచుకుంటూ వెళుతున్నాడు. అయితే రోడ్డుపై ఏదో రాయి మెరుస్తూ కనిపించింది. దగ్గరకు వెళ్లి దానిని గమనించాడు. ఏదో రంగు రాయి అనుకుని ఆసక్తిగా ఉండటంతో ఇంటికి తీసుకెళ్లాడు.

కుటుంబ సభ్యులతో పాటు చుట్టుపక్కల వారికి రాయిని చూపించాడు. అది డైమండ్ అని బంధువులు, ఇంటి పక్కనవారు చెప్పారు. దీంతో మిత్రులతో కలిసి డైమండ్ తనిఖీ కేంద్రానికి రాయిని ఇచ్చి టెస్ట్ చేయించాడు. దాంతో అది వజ్రమని తేలింది. నిజమైన 2.83 క్యారెట్ల వజ్రం అని టెస్టింగ్ చేసిన తర్వాత డైమండ్ కేంద్రం వారు వెల్లలడించారు. దాని ధర దాదాపు రూ.5 లక్షల వరకు ఉంటుందని వివరించారు.

దీంతో సదరు కూలీ దానిని వేలం పాటకు పెట్టేందుకు ఏర్పాట్లు చేస్తున్నాడు. వేలం పాటలో వచ్చిన డబ్బును అధికారులు నందిలాల్ ఇవ్వనున్నారు. ఈ డబ్బులతో తాను ఇళ్ల కట్టుకుంటానని నందిలాల్ చెబుతున్నారు. వజ్రం అని తేలడంతో అతడు ఎగిరి గంతేస్తన్నాడు. అదృష్టం వజ్రం రూపంలో కలిసి వచ్చిందని ఆనందం వ్యక్తం చేస్తున్నాడు.

Related Articles

ట్రేండింగ్

YSRCP: మే ఒకటో తేదీనే ఉద్యోగుల ఖాతాల్లో జీతాలు.. జగన్ మాయలు మామూలుగా లేవుగా!

YSRCP:  మే 1, బుధవారం ఉదయం గవర్నమెంట్ ఉద్యోగస్తులందరూ ఒక్కసారిగా షాక్ అయ్యారు. తమ ఫోన్స్ కి వస్తున్న మెసేజ్లను చూసి ఏం జరిగిందో తెలియని అయోమయంలో పడ్డారు. అయితే అసలు విషయం...
- Advertisement -
- Advertisement -