Wife Rented: అద్దె భార్యను పెళ్లి చేసుకున్న తెలివైన వ్యక్తి.. ట్విస్ట్ ఏంటంటే?

Wife Rented: ఇండియాలో అమ్మాయిల సంఖ్య తగ్గుతోంది. ముఖ్యంగా నార్త్‌లో అమ్మాయిల పాపులేషన్ బాగా తగ్గుతుంది. రాజస్థాన్, మధ్యప్రదేశ్, బీహార్ వంటి రాష్ట్రాల్లో అమ్మాయిల జనాభా తక్కువగా ఉందని లెక్కలు చెబుతున్నాయి. ఇండియాలో అబ్బాయిల జనాభాతో సమానంగా అమ్మాయిలు లేకపోవడంతో చాలామంది పురుషులకు పెళ్లిళ్లు కావడం లేదు. దీంతో అమ్మాయిలకు అబ్బాయిలు ఎదురు కట్నం ఇచ్చి మరీ పెళ్లి చేసుకునే పరిస్థితులు ఏర్పడ్డాయి.

కన్యాశుల్కం చెల్లించి పేదింటి అమ్మాయిలను పెళ్లి చేసుకుంటున్నారు కొంతమంది అబ్బాయిలు. పెళ్లి కోసం ఓ యువకుడు అమ్మాయిని మోసగించి పెళ్లి చేసుకున్నాడు. ఓ కేటుగాడు తన భార్య స్నేహితురాలిని అద్దె భార్య పేరుతో నమ్మించాడు. మధ్యప్రదేశ్‌లోని ఒక వ్యక్తికి అద్దె భార్యగా వెళ్లాలని, డబ్బులు వస్తాయంటూ నమ్మించాడు. యువతి సీరియల్ నటిగా పనిచేస్తోంది. దీంతో డబ్బుల కోసం కొన్ని రోజుల పాటు భార్యగా ఉండేందుకు ఓకే చెప్పింది. స్నేహితురాలు భర్త కావడంతో అతడి మాటలను నమ్మి మధ్యప్రదేశ్‌కు చెందిన ముకేష్ దగ్గరకు వెళ్లింది. యువతిని తీసుకెళ్లి ముకేష్ తన కుటుంబసభ్యుల సమక్షంలో పెళ్లి చేసుకున్నాడు.

 

అలాగే ఇంట్లోనే అతడితో ఉంటుంది. ఐదు రోజులు భార్యగా నటించాలని, ఆరో రోజు వెళ్లిపోవచ్చని ముకేష్ చెప్పాడు. అయితే ఆరో రోజు వచ్చినా యువతిని ముకేష్ వెళ్లనీయలేదు. దీంతో యువతి ప్రశ్నించగా.. తాను నిన్ను నిజమైన పెళ్లి చేసుకున్నానని, నువ్వుంటే నాకు ఇష్టమని చెప్పేశాడు. నీతో ప్రేమలో పడిపోయానని, నిన్ను పెళ్లి చేసుకునేందుకు కరణ్‌కు డబ్బులు కూడా ఇచ్చానని చెప్పాడు. దీంతో మోసపోయినట్లు గ్రహించిన యువతి.. కరణ్ కు ఫోన్ చేసి వాగ్వాదానికి దిగింది. యువతి పోలీసులు దీనిపై ఫిర్యాదు చేయడంతో.. ఆమెను పోలీసుల రక్షించారు. పెళ్లికి అమ్మాయిలు దొరకలేదని ముఖేష్ ఇలా డబ్బులు ఇచ్చి అమ్మాయిని మోసగించి పెళ్లి చేసుకున్నాడు.

 

Related Articles

ట్రేండింగ్

YSRCP Leaders Tension: టీడీపీ జనసేన కూటమి మేనిఫెస్టో విషయంలో వైసీపీ భయాలివేనా.. ఆ టెన్షన్ తగ్గట్లేదా?

YSRCP Leaders Tension:తెలుగుదేశం పార్టీ మేనిఫెస్టో విడుదల చేసిన తర్వాత జగన్ పార్టీలో భయం మొదలైనట్లుగా ఉంది. ఎందుకంటే వైసీపీ మేనిఫెస్టోలో ఉన్నా హామీల కన్నా కూటమి ఇచ్చిన హామీలు చాలా చాలా...
- Advertisement -
- Advertisement -