Madhya Pradesh: భార్యలను అద్దెకు ఇచ్చే ఆచారం భారత్ లో ఎక్కడుందో తెలుసా?

Madhya Pradesh: సాధారణంగా అద్దెకు ఇళ్ళను, వస్తువులను ఇస్తుంటాం. ఈ మధ్య కాలంలో కెమెరాలు, బైకులు కూడా అద్దెకు ఇస్తున్నారు. కానీ భార్య లను కూడా అద్దెకు ఇస్తారని ఎప్పుడైనా విన్నారా, భార్యలను అద్దెకు ఇవ్వడమెంటని ఆశ్చర్యపోతున్నారా ఇది నిజం. భార్యలను అద్దెకు ఇచ్చే సంప్రదాయం ఎక్కడో కాదు మన దేశంలోనే.

మధ్యప్రదేశ్ లోని ఓ గ్రామంలో భార్యలను అద్దెకిచ్చే సంప్రదాయం మనుగడలో ఉంది. ఇప్పటికీ ఈ ఆచారం కొనసాగుతోంది. ఈ ఆచారాన్ని రూపుమాపేందుకు ప్రయత్నించిన అక్కడి ప్రజలు మాత్రం ససేమీరా అంటున్నారు. ఏళ్ల తరబడి కొనసాగుతున్న ఈ సంప్రదాయాన్ని విడనాడేందుకు తాము సిద్దంగా లేమని ఖరాఖండిగా చెప్తున్నారు. శివపురి జిల్లాలోని ఓ గ్రామంలో తమ భార్యలను భర్తల అద్దెకు ఇస్తారు. అది కూడా ఒకటి రెండు రోజులు కాదు ఏకంగా సంవత్సరాలపాటు అద్దెకు ఇస్తారు.

దీన్ని ధదీచ ప్రాత అని పిలుస్తుంటారు. భార్యను అద్దెకు తీసుకెళ్ళే వ్యక్తి వారి భర్తలకు రూ.10 లేదా 100 స్టాంపు కాగితాలపై సంతకాలు పెట్టి ధర మాట్లాడుకుని అద్దెకు తీసుకుపోతారు. ఈ ప్రాంతంలో ఎక్కువగా గ్వాలియర్ రాజపుత్రులు ఉంటారు. వీరు ధనవంతులు కావడంతో అక్కడి సామాన్య ప్రజల అమాయకత్వాన్ని ఆసరా చేసుకొని అద్దెకు తీసుకెళ్తుంటారు.పైగా ఇది సంప్రదాయమని చెప్తూ ఇతరుల భార్యలను అద్దెకు తీసుకెళ్తారు. ఒక్కో మహిళకు రూ. 10 వేల నుంచి రూ. లక్ష వరకు అద్దె
చెల్లించడం గమనార్హం. వయసు తక్కువ ఉన్న వారికి డిమాండ్ ఎక్కువ ఉంటుంది. వయసు ఎక్కువ ఉన్న వారికి డిమాండ్ తక్కువ ఉంటుంది. అలా వయస్సును బట్టి డబ్బులను భర్తకుర్త చెల్లించి వారి భార్యను తీసుకెళ్తుంటారు.

 

అద్దెకు తీసుకెళ్లినళ్లి తరువాత వారికి పిల్లలు పుడితే వారి బాధ్యతే. పెళ్లి కాని వారిని కూడా అద్దెకు తీసుకెళ్లే సందర్భాలు ఉంటాయి. ఈ ఆచారాన్ని ఎంత దూరం చేయాలని ప్రయత్నించినా సఫలం కాలేదు. ఇంకా ఈ ఆచారం మధ్యప్రదేశ్ లోనే కాకుండా గుజరాత్ లో కూడా మనుగడలో ఉండటం గమనార్హం.

Related Articles

ట్రేండింగ్

YSRCP Leaders Tension: టీడీపీ జనసేన కూటమి మేనిఫెస్టో విషయంలో వైసీపీ భయాలివేనా.. ఆ టెన్షన్ తగ్గట్లేదా?

YSRCP Leaders Tension:తెలుగుదేశం పార్టీ మేనిఫెస్టో విడుదల చేసిన తర్వాత జగన్ పార్టీలో భయం మొదలైనట్లుగా ఉంది. ఎందుకంటే వైసీపీ మేనిఫెస్టోలో ఉన్నా హామీల కన్నా కూటమి ఇచ్చిన హామీలు చాలా చాలా...
- Advertisement -
- Advertisement -