Chiranjeevi vs Balayya: చిరంజీవి బాలయ్య.. ఇద్దరు వీరులలో విజేత ఎవరో?

Chiranjeevi vs Balayya: టాలీవుడ్ కు ఇద్దరు పెద్ద దిక్కు వంటి హీరోలు.. ఒకరు మెగాస్టార్ చిరంజీవి, నందమూరి నటసింహం బాలయ్య. వీరిద్దరూ దాదాపుగా టాలీవుడ్ ను మొత్తాన్ని శాసిస్తారు. అంత పాపులారిటీ వీళ్ళ సొంతం. ఇక ఈ హీరోల సినిమాలు విడుదల అయ్యాయంటే ఆయా హీరోల అభిమానులకు పండగే. అయినప్పటికీ ఎవరి ఫ్యాన్ ఫాలోయింగ్ వారికి ప్రత్యేకమే. ఇక ఈ ఇద్దరు హీరోలు మొదటి నుండే వివిధ సందర్భాల్లో పోటీ పడేవారు. ఇక ఇటీవల మళ్ళీ ఆ చర్చ మొదలైంది.

 

సంక్రాంతి బరిలో నువ్వా నేనా.
అప్పట్లో టాలీవుడ్ ను వీరు ఏలిన రోజు నుండి ఇప్పటి వరకు ఈ ఇద్దరు హీరోల సినిమాల విడుదల అంటే ఒక రకమైన పండగ వాతావరణం నెలకొనేది. దాదాపుగా కొద్దీ రోజుల గ్యాప్ తో వీరిద్దరి సినిమా విడుదల అయితే ఇక అది ఫ్యాన్స్ కు పెద్ద పండగే. అభిమానులు కూడా తమ హీరో సినిమా హైలెట్ అంటే తమ హీరో సినిమానే హెలెట్టని చర్చలు, మీటింగులు పెట్టేసుకునేవారు. అలా ఈ ఇద్దరు హీరోల సినిమాలు సినీ వాతావరణాన్ని మొత్తం మార్చేసేవి. ముఖ్యంగా ప్రతి సంక్రాంతి పండగకు ఈ ట్రెండ్ చాలా రోజులే కొనసాగింది.

 

ఇక ప్రస్తుతం అలంటి ట్రెండ్ టాలీవుడ్ లో మళ్ళీ మొదలయిందని గుసగుసలు వినిపిస్తున్నాయి. దానికి కారణం మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ నుండి మెగాస్టార్ చిరంజీవి “వాల్తేరు వీరయ్య”, బాలయ్య బాబు “వీరసింహారెడ్డి” సినిమాలు కేవలం ఒక్కరోజు గ్యాప్ లో రిలీజ్ అవుతున్నాయి. ఇలా తమ అభిమాన చిరంజీవి, బాలయ్య మూవీలు ఒకే సమయంలో విడుదల అప్పట్లో ట్రెండ్ ,మళ్ళీ రిపీట్ అవుతుందని చర్చలు ప్రారంభమయ్యాయి.

 

సంక్రాంతి విన్నర్ బాలయ్యా? చిరునా?
ఇక సినీ జనాలు అప్పుడే ఈ సంక్రాంతి విన్నర్ ఎవరనే చర్చ ప్రారంభించేసారు. సంక్రాంతికి బరిలో మూవీల్లో తమ హీరోనే పైచేయి సాధించాలని ఇటు చిరు అభిమానులు, అటు బాలయ్య ఫ్యాన్స్ అనుకుంటున్నారు. ఈ పరిస్థితి చూస్తుంటే సినీ ప్రియులకు మాత్రం ఈ సంక్రాంతి రెట్టింపు ఉత్సాహాన్ని అందిస్తుందనే విషయం ఇట్టే అర్ధం అయిపోతుంది. చూద్దాం మరి అభిమానులను తమ తమ హీరోలు ఎలా అలరిస్తారో.

Related Articles

ట్రేండింగ్

CM Jagan: కూటమి విజయాన్ని ఫిక్స్ చేసిన జగన్.. మేనిఫెస్టో హామీలతో బొక్కా బోర్లా పడ్డారా?

CM Jagan: త్వరలోనే అసెంబ్లీ ఎన్నికలు జరగబోతున్నటువంటి తరుణంలో పెద్ద ఎత్తున ప్రచార కార్యక్రమాలలో నిర్వహిస్తున్నారు. అయితే వైసిపి అధినేత జగన్మోహన్ రెడ్డి వై నాట్ 175 అంటూ ప్రచార కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు....
- Advertisement -
- Advertisement -