YS Sharmila: మోడ్రన్‌లుక్‌ లో వైఎస్ షర్మిల..సూపర్బ్‌ అంటూ నెటిజన్ల కామెంట్స్

YS Sharmila: తెలుగు రాష్ట్రాల్లోని రాజకీయాల్లో వైఎస్ కుటుంబానికి ప్రత్యేక చరిత్ర ఉంది. దివంగత రాజశేఖరరెడ్డి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌కు సీఎంగా ఉంటూ అనేక కార్యక్రమాలను విజయవంతం చేశారు. అయితే దురదృష్టవశాత్తు వైఎస్ఆర్ విమాన ప్రమాదంలో చనిపోయారు. అప్పట్లో వైఎస్సార్‌ మృతిని తట్టుకోలేక చాలా మంది ప్రాణాలు విడిచిన ఘటనలు కూడా ఉన్నాయి. వైఎస్సార్ కుమారుడు అయిన వైఎస్ జగన్ ఇప్పుడు ఏపీ సీఎంగా కొనసాగుతున్నారు. ఇక వైఎస్సార్‌ కుమార్తె అయిన వైఎస్‌ షర్మిల కూడా తండ్రి వారసత్వాన్ని పుణికి పుచ్చుకుని రాజకీయాల్లో వచ్చారు.

 

ప్రస్తుతం వైఎస్‌ షర్మిల తెలంగాణలో సొంతంగా వైఎస్సార్‌టీపీ పార్టీని స్థాపించి ప్రజా ప్రస్థానం పేరుతో పాదయాత్రను చేపడుతున్నారు. రాష్ట్ర సమస్యలపై అలుపెరగని పోరాటం చేస్తూ ప్రజలకు చేరువయ్యే ప్రయత్నం చేస్తున్నారు. ఇక రాజకీయాల సంగతి పక్కన పెడితే షర్మిల భర్త అయిన అనిల్‌ కుమార్‌ దైవ సేవకుడిగా ఉన్నారు. వీరికి ఇద్దరు పిల్లలు. కుమార్తె అంజలి, కొడుకు రాజారెడ్డి ఇద్దరూ చదువుకుంటున్నారు.

నేడు షర్మిల కొడుకు రాజారెడ్డి పుట్టినరోజు కావడంతో షర్మిల తన కొడుకుతో దిగిన ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేశారు. నెట్టింట తన కుమారుడికి వైఎస్ షర్మిల బర్త్ డే విషెస్ తెలియజేశారు. హ్యాపీ బర్త్‌ డే రాజా.. హ్యాపినెస్‌ ఆల్వేస్‌.. ఎప్పటికి నిన్ను ప్రేమిస్తూనే ఉంటాను అనే మాటలతో పుట్టినరోజు శుభాకాంక్షలను తెలిపారు. దాంతో పాటుగా కొడుకుని హగ్‌ చేసుకుని ఉన్న ఫోటోను కూడా ఆమె పంచుకున్నారు. ప్రస్తుతం ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

 

సాధారణంగా షర్మిల ఎప్పుడూ చీరల్లోనే కనిపిస్తారు. వైఎస్ షర్మిల మనకు కాటన్‌ చీర, డ్రెస్‌లో ఉండటమే తెలుసు. కానీ తాను షేర్ చేసిన ఫోటోలో షర్మిల మోడ్రన్ డ్రస్ లో కనిపించారు. వైట్‌ కలర్‌, ఫ్లోరల్‌ ప్రింట్‌ ఉన్న టాప్‌ లేదా లాంగ్‌ ఫ్రాక్‌ ధరించి షర్మిల ఉండటంతో నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. మోడ్రన్ డ్రస్ లో బావున్నావు షర్మిలక్క అంటూ రాజారెడ్డికి విషెస్ చెబుతున్నారు.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -