Tollywood Heroes: ఈ హీరోలు డబ్బులు తీసుకోకుండా నటించారని మీకు తెలుసా?

Tollywood Heroes: సినీ ఇండస్ట్రీలో ప్రతి ఒక్కటీ డబ్బులతో ముడిపడిందే. చాలా మంది హీరోలు, హీరోయిన్లు భారీ హిట్లు అందుకుని డబ్బులు కూడా భారీగానే సంపాదించారు. అయితే కొందరు మాత్రం అలా కాదు. కొన్ని సినిమాల్లో రూపాయి కూడా తీసుకోని హీరోలు సైతం టాలీవుడ్ లో ఉన్నారు. మరి అలాంటి వారు ఎవరు? వారు ఎందుకు రూపాయి కూడా తీసుకోకుండా సినిమాలో నటించారో ఇప్పుడు తెలుసుకుందాం.

 

మెగాస్టార్ చిరంజీవి తాజాగా నటించిన సినిమా గాడ్ ఫాదర్. ఈ సినిమాను మలయాళం లూసిఫర్ లో మోహన్ లాల్ చేశారు. దానిని తెలుగులోకి చిరంజీవి రిమేక్ చేశారు. ఈ సినిమాలో చిరంజీవి కోసం సల్మాన్ ఖాన్ ఒక్క రూపాయి కూడా తీసుకోకుండా నటించారట. చిరంజీవి మీద ప్రేమతో ఇలా చేశారట.

 

మోస్ట్ పవర్ ఫుల్ హీరో అయిన సూర్య ఇటీవలె విక్రమ్ సినిమాలో కనిపించారు. ఆ సినిమాలో చివరి 10 నిమిషాలు రోలెక్స్ పాత్రలో సూర్య నటించి మెప్పించారు. ఆ సినిమాకు అదొక హైలెట్ అనే చెప్పాలి. ఈ సినిమాలో సూర్య రూపాయి కూడా తీసుకోకుండా చేశారట. కమల్ హాసన్ మీద ఉన్న ప్రేమతో, ఇష్టంలో సూర్య రూపాయి కూడా తీసుకోలేదట.

 

రుద్రమదేవి సినిమాలో గోనగన్నారెడ్డి పాత్రలో కనిపించిన అల్లు అర్జున్ కూడా రూపాయి కూడా తీసుకోలేదట. అయితే దర్శకుడు గుణశేఖర్ మీద ఇష్టంతో బన్నీ ఈ పని చేశాడట.

 

స్టార్ హీరో అయిన మాధవన్ ఇటీవలె రాకెట్రీ అనే సినిమా తీశారు. ఈ సినిమాలో సూర్య కనిపించారు. యాంకర్ గా కనిపించే పాత్ర చేసిన సూర్య ఈ సినిమాలో నటించినందుకు ఒక్క రూపాయి కూడా తీసుకోలేదట. తన ఫ్రెండ్ మాధవన్ కోసమే తాను రూపాయి కూడా తీసుకోకుండా నటించినట్లు సూర్య తెలుపడం విశేషం.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -