Hero Nani: ఎన్నికల బరిలో హీరో నాని.. ఎక్కడి నుంచి అంటే..!

Hero Nani: నేచురల్‌ స్టార్‌ నాని టాలీవుడ్‌లో తనదైన ముద్ర వేశాడు. మెగాస్టార్‌ చిరంజీవి, మాస్‌ మహారాజ రవితేజ తరహాలో సినిమా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి సొంతంగా గుర్తింపు తెచ్చుకున్నాడు హీరో నాని. తన చిత్రాల్లో తగిన కామెడీ టైమింగ్‌తో అదరగొట్టే నాని.. హీరోయిక్‌ సన్నివేశాల్లోనూ అదే స్థాయిలో రాణిస్తున్నాడు. రాజమౌళి దర్శకత్వంలో ఈగ లాంటి వైవిధ్య భరిత రోల్స్‌నూ ఆకట్టుకొనేలా చేసి అందరినీ మెప్పించాడు నాని.

 

తాజాగా హీరో నాని నటిస్తున్న చిత్రం దసరా. ఈ మూవీ పాన్‌ ఇండియా రేంజ్‌లో వస్తోంది. శ్రీకాంత్‌ ఓదెల దర్శకత్వంలో ఈ చిత్రం తెరకెక్కుతోంది. చెరుకూరి సుధాకర్‌ నిర్మాణంలో వస్తున్న ఈ మూవీలో కీర్తి సురేష్‌ కథానియికగా నటిస్తోంది. కీర్తి సురేష్‌, నాని కాంబోలో ఇప్పటికే ఓ సినిమా వచ్చింది. నేను లోకల్‌ అనే చిత్రంలో వీరిద్దరూ కలిసి నటించారు. ఈ చిత్రం మిక్స్‌ టాక్‌ తెచ్చుకుంది. జెర్సీ మూవీతో బ్లాక్‌ బస్టర్‌ హిట్‌ కొట్టిన నాని.. తర్వాత కెరీర్‌లో గుర్తుండిపోయే మూవీ చేయాలని ఉత్సాహంగా ఉన్నారు.

 

ఈ క్రమంలో ప్రస్తుతం చేస్తున్న దసరా మూవీ కోసం నాని చాలా కష్టపడుతున్నాడు. దసరా మూవీలో ఎన్నికల ఎపిసోడ్ ఉన్నట్లు తెలుస్తోంది. ఇందులో నాని గ్రూప్, ప్రత్యర్ధి గ్రూపుల మధ్య పోటాపోటీగా ఒక ఎలక్షన్ సీక్వెన్స్ నడుపుతున్నట్లు సమాచారం. తెలంగాణలోని గోదావరిఖని మైన్స్‌ నేపథ్యంలో ఈ ఎన్నికలు కొనసాగుతాయని తెలుస్తోంది.

 

గెటప్‌ పూర్తిగా మార్చేసిన నాని..
ఇప్పటికే రామ్‌చరణ్‌ హీరోగా నటించిన రంగస్థలం మూవీలో ఆగట్టునుంటావా.. నాగన్న ఈ గట్టుకొస్తావా?.. సాంగ్‌ ఎన్నికల నేపథ్యంలో సాగుతుంది. ఇలాంటి పాటే ఒకటి దసరా మూవీలో ప్లాన్‌ చేస్తున్నారట. బిట్‌ సాంగ్‌గా దీన్ని వదలాలని చిత్ర టీమ్‌ భావిస్తోంది. నాని గతంలో ఎన్నడూ చేయని మాస్‌ రోల్‌ దసరా మూవీలో చేస్తున్నారు. ఇందుకోసం తన గెటప్‌ను పూర్తిగా మార్చేశారు. ఎంతలా అంటే.. మూవీ సిబ్బంది కొందరు షూటింగ్‌లో నానిని అసలు గుర్తు పట్టలేకపోతున్నారని టాక్. యాక్షన్‌ సీన్స్‌ కోసం ప్రత్యేకంగా కసరత్తులు చేశారట నాని. ఈ మూవీలో మలయాళ నటుడు రోషన్‌ మాథ్యూ ప్రత్యేక రోల్‌లో యాక్ట్‌ చేస్తున్నారు. మార్చి 30న విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు.

Related Articles

ట్రేండింగ్

Nara Chandrababu Naidu: అలా జరిగి ఉంటే ఓట్లు అడిగేవాడిని కాదు.. చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు వైరల్!

Nara Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు ప్రజాగళంలో భాగంగా ఆదివారం కర్నూలు జిల్లా మంత్రాలయం నియోజకవర్గంలో కౌతాళం సభలో మాట్లాడారు. జగన్ పాలన గురించి మాట్లాడుతూ గత ఐదేళ్లలో రాష్ట్రంలో ఎలాంటి అభివృద్ధి...
- Advertisement -
- Advertisement -