Chiranjeevi-Balayya: చిరంజీవి, బాలయ్య సాంగ్స్ లో ఏ పాట మెప్పించిందంటే?

Chiranjeevi-Balayya: ప్రస్తుతం టాలీవుడ్‌లో ఎక్కువగా మెగాస్టార్ చిరంజీవి, నందమూరి నటసింహం ఎన్టీఆర్ నటిస్తున్న సినిమాలపై ఫోకస్ ఏర్పడింది. ఈ రెండు సినిమాల్లో ఏది హిట్ కొడుతుందని అటు బాలయ్య ఫ్యాన్స్, ఇటు మెగాస్టార్ ఫ్యాన్స్ ఎంతో ఆతురతగా ఎదురుచూస్తున్నారు. సంక్రాంతి కానుకగా ఈ రెండు సినిమాలు బరిలో దిగనున్నాయి. అయితే ఇప్పటికే వీరిద్దరి సినిమాలు సంక్రాంతి బరిలో పోటీ చేశాయి. ఒకరి సినిమా బ్లాక్ బస్టర్ హిట్ కొడితే.. మరో హీరో సినిమా మాత్రం బోల్తా కొట్టాయి. ఒక్కోసారి ఇద్దరు హీరోల సినిమాలు మంచి హిట్ అందుకున్నారు. ఈ క్రమంలో తాజాగా బాలయ్య ‘వీరసింహారెడ్డి’, చిరంజీవి ‘వాల్తేరు వీరయ్య’ సినిమాలు పోటాపోటీగా విడుదల కానున్నాయి.

 

 

టాలీవుడ్ సినిమాలకు సంక్రాంతి పండుగ ఒక సెంటిమెంట్ లాంటిది. ఎందుకంటే సంక్రాంతి పండుగకు బరిలో దిగిన చాలా వరకు సినిమాలు బ్లాక్ బస్టర్ హిట్ అయ్యారు. థియేటర్ల వద్ద కలెక్షన్ల వర్షం కురిపించాయి. ఇప్పుడు ఈ ఇద్దరు స్టార్ హీరోల సినిమాలు కూడా అదే తరహాలో వైబ్రేషన్స్ చూపిస్తున్నాయి. ఇప్పటికే ఈ రెండు సినిమాలకు సంబంధించిన సాంగ్స్, ట్రైలర్, పోస్టర్లు ప్రేక్షకులను బాగానే ఆకట్టుకున్నాయి. ప్రస్తుతం ఈ రెండు సినిమాలపై ఎక్కువ ఫోకస్ ఉండటంతో.. వీటికి సంబంధించిన ఏ అప్‌డేట్ వచ్చినా వైరల్ అవుతోంది. తాజాగా ఈ రెండు సినిమాల నుంచి విడుదలైన పాటలకు ఎన్ని వ్యూవ్స్ వచ్చాయనే దానిపై చర్చలు జరుగుతున్నాయి.

 

 

దాదాపు ఒకే తరహాలో ఈ రెండు సినిమాల పాటలు యూట్యూబ్‌లో ట్రెండ్ అవుతున్నాయి. కానీ వ్యూవ్స్ విషయానికి వస్తే.. వాల్తేరు వీరయ్య మూవీ నుంచి విడుదలై సాంగ్ పై చేయి సాధించింది. అలాగే అంతకు ముందు ‘వీరసింహారెడ్డి’ నుంచి విడుదలైన ‘జై బాలయ్య’ సాంగ్ కంటే.. వాల్తేరు వీరయ్య ‘బాస్ పార్టీ’ అధికంగా వ్యూవ్స్, లైక్స్ సంపాదించుకుంది. అలాగే రీసెంట్‌గా ఈ మూవీల నుంచి రెండో సాంగ్ కూడా రిలీజ్ అయింది. వీరసింహారెడ్డి నుంచి ‘సుగుణసుందరి’ అనే పాట రిలీజ్ కాగా.. వాల్తేరు వీరయ్య నుంచి ‘శ్రీదేవి’ పాట విడుదలైంది. గడిచిన 24 గంట్లో శ్రీదేవి సాంగ్‌కు 6.16 మిలియన్ వ్యూవ్స్, 160.3k లైక్స్ వచ్చాయి. అలాగే సుగుణ సుందరి పాటకు 4.83 మిలియన్ వ్యూవ్స్, 155.2k లైక్స్ వచ్చాయి. ఒవరాల్‌గా చూస్తే చిరంజీవి సినిమా సాంగ్స్ టాప్ ట్రెండింగ్‌లో నిలిచాయి.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -