NTR: అంత క్రూరమైన గెటప్ లో యంగ్ టైగర్ కనిపిస్తారా?

NTR: యంగ్ టైగర్ ఎన్టీఆర్, ప్రముఖ దర్శకుడు కొరటాల శివ కాంబినేషన్లో ఓ సినిమా రూపొందుతోంది. ఈ సినిమా ఎన్టీఆర్ 30వ సినిమా కావడం విశేషం. ఆర్ఆర్ఆర్ లాంటి పాన్ ఇండియా సినిమా తర్వాత తారక్ తన తదుపరి సినిమాను వేరే లెవల్లో తెరకెక్కించనున్నారు. ఎన్టీఆర్ 30 వర్కింగ్ టైటిల్ తో ఈ సినిమా పట్టాలెక్కనుంది. ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించిన స్క్రీప్ట్ వర్క్ శరవేగంగా సాగుతున్నాయి.

 

తన 30వ సినిమా వర్క్స్ సాగుతుండగా మరో వైపు ఎన్టీఆర్ విదేశీ టూర్ కు వెళ్లారు. ప్రస్తుతం ఆయన ఫ్యామిలీ టూర్ లో బిజీగా ఉన్నారు. జనవరిలోనే ఆయన భారత్ కు రానున్నట్లు తెలుస్తోంది. కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కే సినిమాకు నందమూరి తారకరామారావు ఆర్ట్స్, యువసుధ ఆర్ట్స్ వారు నిర్మాతలుగా వ్యవహరించనున్నారు. ఈ సినిమాను పాన్ ఇండియా స్థాయిలో సంయుక్తంగా ఈ సంస్థలు నిర్మించబోతున్నాయి.

 

ఇక‌పోతే కొరటాల శివ, ఎన్టీఆర్ కాంబోలోని సినిమాను ప్రకటించి చాలా కాలమే అయినా ఇప్పటివరకు షూటింగ్ ప్రారంభం కాలేదు. ఈ విషయంలో ఫ్యాన్స్ కొంత నిరుత్సాహంలో ఉన్నారు. ఈ తరుణంలో ఈ సినిమాలోని తారక్ గెటప్ గురించి ఓ వార్త బయటకి వచ్చింది. ఈ సినిమాలో ఎన్టీఆర్ అఘోరాగా కనిపించనున్నారట.

 

గతంలో నందమూరి బాలకృష్ణ హీరోగా బోయపాటి దర్శకత్వంలో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిన అఖండ సినిమా భారీ హిట్ గా నిలిచింది. ఆ సినిమాలో బాలయ్య అఘోరాగా అదరగొట్టారు. ఆ పాత్రకు ఆయన సరిపోయారని అందరూ ప్రశంసల జల్లు కురిపించారు. తాజాగా ఇప్పుడు ఆ క్యారెెక్టర్ నే తారక్ వేయనున్నాడు. సినిమాలో తారక్ అఘోరాగా కొన్ని నిమిషాల పాటు ఉంటాడని టాక్ వినిపిస్తోంది. దీంతో తారక్ ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అవుతున్నారు. అఘోరా గెటప్ తారక్ కు కొత్తగా ఉండటంతో పాటు ఫ్యాన్స్ ను ఆకట్టుకునేలా ఉంటుందని తెలుస్తోంది.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -