Prabhas: అయ్యో.. ప్రభాస్ ది విగ్గా.. అలా ఇబ్బంది పడుతున్నాడా?

Prabhas: టాలీవుడ్ పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. బాహుబలి సినిమాతో పాన్ ఇండియా స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్న ప్రభాస్ ఆ తర్వాత వరుసగా పాన్ ఇండియా సినిమాల్లో నటిస్తూ బిజీ బిజీగా ఉన్న విషయం తెలిసిందే. ప్రస్తుతం ప్రభాస్ బోలెడు ప్రాజెక్టులతో బిజీబిజీగా గడుపుతున్నాడు. ఆది పురుష్, సలార్, స్పిరిట్, ప్రాజెక్ట్ కే లాంటి సినిమాలలో నటిస్తూ బిజీ బిజీగా ఉన్నాడు. ఇది ఇలా ఉంటే తాజాగా హీరో ప్రభాస్ కి సంబంధించిన ఒక వార్త తెగ వైరల్ అవుతోంది. అదేంటంటే..

 

ప్రభాస్ ది ఒరిజినల్ జుట్టు కాదు విగ్ అంటూ సోషల్ మీడియాలో జోరుగా వార్తలు వినిపిస్తున్నాయి. దీంతో ఈ వార్త విన్న చాలా మంది అభిమానులు షాక్ అవుతున్నారు. ఇంకొందరు అభిమానులు ఆ వార్తలపై మండిపడుతున్నారు. అయితే ప్రభాస్ ఈ మధ్యకాలంలో ఎక్కడ కనిపించినా కూడా తలకు క్లాత్ లేదా టోపీ పెట్టుకుని కనిపిస్తున్నాడు. దీంతో తన విగ్ ని కవర్ చేసుకోవడం కోసమే ప్రభాస్ ఆ విధంగా క్యాప్ పెట్టుకుంటున్నాడు అంటూ వార్తలు వినిపిస్తున్నాయి. ఈ క్రమంలోనే ఒక నెటిజన్ అందుకు సంబంధించిన ఒక వీడియోని షేర్ చేశాడు. ఆ వీడియోలో ప్రభాస్ ఒక హెయిర్ స్టైలిస్ట్ హెయిర్ సెట్ చేస్తున్నట్లు ఉంది.

 

ఆ వీడియోలో ఆ హెయిర్‌ స్టైలిస్ట్‌ చేస్తున్న పని చూస్తుంటే ప్రభాస్‌కు నిజంగానే విగ్గు పెడుతున్నట్టుగా కనిపిస్తోంది. వాస్తవానికి ఇది పాత వీడియోనే అయినప్పటికీ మరోసారి ఆ నెటిజన్‌ షేర్‌ చేయడంతో ఇప్పుడు ఈ వార్త నెట్టింట్లో తెగ వైరల్‌ అవుతోంది. ఇకపోతే ప్రభాస్ నటిస్తున్న సినిమాలలో ఆది పురుష్ సినిమా టీజర్ ఇటీవల విడుదల కాగా ఆ టీజర్ పై భారీగా ట్రోలింగ్స్ నెగిటివ్ కామెంట్స్ వినిపించడంతో పాటు ప్రభాస్ సైఫ్ అలీ ఖాన్ లుక్కులపై విమర్శలు రావడంతో ఆ సినిమాను ప్రస్తుతం ఎడిట్ చేసే పనిలో ఉన్నారు చిత్ర బృందం.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -