Chinmayi: చిన్మయి సంచలన వ్యాఖ్యలు.. వాళ్ల నోరు మూయించేలా?

Chinmayi: సెలబ్రిటీలు అంటే వినోదాన్ని పంచడమే కాదు వారి వ్యక్తిగత జీవితాన్ని కూడా సోషల్ మీడియాలో పెట్టడం అని చాాలా మంది అనుకుంటారు. వారిపై మీమ్స్ చేస్తారు. ట్రోల్స్ చేస్తూ వారిని బాధపెడుతుంటారు. సరిగ్గా ఈ మధ్యకాలంలో అలాంటివి సెలబ్రిటీలపై ఎక్కువవుతున్నాయి. ముఖ్యంగా బాడీ షేమ్ గురించి కామెంట్స్ విపరీతంగా వినిపిస్తున్నాయి. హీరోయిన్లు ఏ మాత్రం అటు ఇటుగా కనిపించినా సరే హీరో, హీరోయిన్‌ అనే తేడాలు లేకుండా అందరినీ నెటిజన్లు ఓ ఆట ఆడుకుంటున్నారు. దీంతో నెటిజన్లు చేసే కామెంట్ల వల్ల కొందరు సెలబ్రిటీలు ఇబ్బందులు పడాల్సి వస్తోంది. తాజాగా నయనతార మీద కూడా నెటిజన్లు విరుచుకుపడ్డారు.

 

లేడీ సూపర్ స్టార్ నయన తార గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఆమె సౌత్‌ ఇండియాలో టాప్‌ హీరోయిన్‌ గా ఓ వెలుగు వెలిగారు. ఇప్పటికీ స్టార్ హీరోయిన్ గా ఆమె రాణిస్తున్నారు. ఈ మధ్యనే ఆమె పెళ్లి చేసుకుని సరోగసి ద్వారా ఇద్దరు పిల్లలకు తల్లి అయ్యారు. తాజాగా ఆమె కనెక్ట్ అనే సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఈ సందర్భంగా పలు ప్రమోషన్ కార్యక్రమాల్లో ఆమె పాల్గొంటూ వస్తున్నారు.

 

ఈ సినిమా చూసిన తర్వాత ఆమెపై నెటిజన్లు విపరీతంగా ట్రోల్స్ చేస్తున్నారు. ఆమెను చూసిన వారు ఇద్దరు పిల్లలు వచ్చిన తర్వాత కూడా నయనతార ఫిజిక్ చేంజ్ కాలేదని ట్రోల్స్ చేస్తున్నారు. ఆమె ప్రైవేట్‌ పార్ట్స్‌ గురించి కూడా వల్గర్ గా కామెంట్స్ చేస్తున్నారు. అయితే తనపై వస్తున్న ట్రోల్స్‌, కామెంట్లపై నయన్‌ పెద్దగా రియాక్ట్ కాలేదు. కానీ సింగర్ చిన్మయి మాత్రం ఈ ట్రోల్స్ పై ఘాటుగానే రియాక్ట్ అయ్యింది.

 

చిన్మయి మాట్లాడుతూ ఇంట్లో తండ్రి, సోదరుడు ఉన్నా కూడా తల్లులు తమ కూతుర్లకు దుప్పట్టా కప్పాల్సి వస్తుందేమోనని అన్నారు. ఎందుకంటే కొందరు మగాళ్లు ఇంట్లో ఆడవారిని చూసినా కోరికలు కంట్రోల్‌ చేసుకోలేకపోతున్నారని, మగాళ్లందరినీ టార్గెట్‌ చేస్తూ చిన్మయి షాకింగ్ కామెంట్లు చేశారు. ప్రస్తుతం ఆమె చేసిన కామెంట్లు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

Related Articles

ట్రేండింగ్

YSRCP Leaders Tension: టీడీపీ జనసేన కూటమి మేనిఫెస్టో విషయంలో వైసీపీ భయాలివేనా.. ఆ టెన్షన్ తగ్గట్లేదా?

YSRCP Leaders Tension:తెలుగుదేశం పార్టీ మేనిఫెస్టో విడుదల చేసిన తర్వాత జగన్ పార్టీలో భయం మొదలైనట్లుగా ఉంది. ఎందుకంటే వైసీపీ మేనిఫెస్టోలో ఉన్నా హామీల కన్నా కూటమి ఇచ్చిన హామీలు చాలా చాలా...
- Advertisement -
- Advertisement -