Nagababu: సీనియర్ నరేష్ పై నాగబాబు షాకింగ్ కామెంట్స్ వైరల్!

Nagababu: తెలుగు సినిమా ఇండస్ట్రీకి ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా ఎంతటి గుర్తింపు ఉందో తెలిసిందే. అంతకంతకు అన్ని విషయాల్లో తెలుగు ఇండస్ట్రీ పేరు యావత్ ప్రపంచాన్ని ఊపేస్తోంది. అయితే సినిమా ఇండస్ట్రీ బయటి నుండి ఎలా ఉన్నా, ఇండస్ట్రీ బాగు కోసం, ఇండస్ట్రీలోని వాళ్ల విషయాలను చూసుకోవడానికి ఏర్పాటు చేసుకున్న ‘మావీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ – మా’ ఎన్నికల విషయానికి వస్తే మాత్రం నానా రభజ జరుగుతోంది.

మా ఎన్నికలు ఎప్పుడు వచ్చినా చాలామంది సినీ ఇండస్ట్రీకి చెందిన వాళ్లు మీడియా ముందు వచ్చి పొలికల్ లీడర్ల లెవల్లో ఆరోపణలు, ప్రత్యారోపణలు చేసుకుంటూ రభస చేస్తుండటం గమనించవచ్చు. నిజానికి సినీ ఇండస్ట్రీలో పని చేస్తున్న వారి సమస్యలను పరిష్కరించుకోవడానికి ఏర్పాటు చేసుకున్న మా అసోసియేషన్ ఇప్పుడు వర్గాల పోరు ద్వారా వార్తల్లోకి ఎక్కుతోంది.

మొన్నీమధ్యన జరిగిన మా ఎన్నికల్లో మా అధ్యక్షుడిగా మంచు విష్ణు గెలవడం తెలిసిందే. అయితే ప్రత్యర్థిగా ప్రకాశ్ రాజ్ ఉండగా, అతడికి మెగా కుటుంబం అండగా నిలబడిన విషయం తెలిసిందే. అయితే మా ఎన్నికల మీద, విష్ణు మరియు నరేష్ ల వ్యవహారం మీద మెగా హీరో నాగబాబు తీవ్రస్థాయిలో వ్యాఖ్యలు చేశారు. మా బిల్డింగ్ ను సొంత డబ్బులతో నిర్మిస్తానని విష్ణు చెప్పడం మీద నాగబాబు అభ్యంతరం వ్యక్తం చేశాడు. మా అంటేనే అందరి సహకారంతో సాగాల్సిన అవసరం ఉంటుందని, ఈగోకి పోయి సొంతంగా బిల్డింగ్ కడతానని అనడం ఏంటని నాగబాబు అన్నారు.

మరోపక్క సీనియర్ హీరో నరేష్ మీద నాగబాబు తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించాడు. మా అసోసియేషన్ చరిత్రలోనే చేతగాని ప్రెసిడెంట్, వేస్ట్ ప్రెసిడెంట్ ఎవరైనా ఉన్నారంటే అది ఖచ్చితంగా నరేష్ అని నాగబాబు అన్నాడు. ‘మా’కి అతడు ప్లస్ అవడం మాట అటుంది, మైనస్ గా మారాడని అన్నాడు. ‘మా’లో ఏం జరిగినా ప్రెస్ మీట్ పెట్టి కంపు చేశాడని అన్నాడు. నరేష్ తన కెపాసిటీ కన్నా ఎక్కువ ఆలోచిస్తాడని, అతడికి అదో రకంగా మానసిక రోగం ఉందని.. పెద్ద తేడాగాడు అని నాగబాబు వ్యాఖ్యానించాడు. పైగా నరేష్ తనను తాను తప్ప, ఇతరులను ఇష్టపడడు అని అన్నాడు. అలాగే నరేష్ తన ప్యానల్ లోని సభ్యులైన శివాజీ రాజా, జీవిత రాజశేఖర్ తో కూడా గొడవలు పెట్టుకున్నాడనే విషయాలను నాగబాబు గుర్తుచేశాడు. నరేష్ స్థిమితంగా ఉండడని, తేడా అని, వివాదాలకు ఎప్పుడూ సిద్ధంగా ఉంటాడని నాగబాబు విమర్శించాడు.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -